హోమ్ /వార్తలు /politics /

Pawan kalyan Speech: రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్... వారికి స్ట్రాంగ్ వార్నింగ్..

Pawan kalyan Speech: రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్... వారికి స్ట్రాంగ్ వార్నింగ్..

ఈ లోపే వాళ్లు టాకీ పార్ట్ పూర్తి చేసుకోవాలి. బల్క్ డేట్స్ ఇస్తాను.. పండగ చేసుకోండి అంటున్నాడు పవన్ కళ్యాణ్. పక్కా స్క్రిప్ట్ వర్క్‌తో దిగితే రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయొచ్చని ఇప్పటికే బంగార్రాజు సహా చాలా సినిమాలు నిరూపించాయి.

ఈ లోపే వాళ్లు టాకీ పార్ట్ పూర్తి చేసుకోవాలి. బల్క్ డేట్స్ ఇస్తాను.. పండగ చేసుకోండి అంటున్నాడు పవన్ కళ్యాణ్. పక్కా స్క్రిప్ట్ వర్క్‌తో దిగితే రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయొచ్చని ఇప్పటికే బంగార్రాజు సహా చాలా సినిమాలు నిరూపించాయి.

రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిరసనగా జనసేన పార్టీ (Janasena Party) తలపెట్టిన శ్రమదానం నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఎమ్మెల్యేలు నేతలపై మండిపడ్డారు.

ఇంకా చదవండి ...

  రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిరసనగా జనసేన పార్టీ (Janasena Party) తలపెట్టిన శ్రమదానం నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఎమ్మెల్యేలు నేతలపై మండిపడ్డారు. సమస్యలపై నిరసన తెలిపాలని రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు అఢ్డుకోలేరని పవన్ కల్యాణ్ అన్నారు. మీరు తొక్కేకొద్ది లేస్తాం తప్ప.. వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడుతంటే అవి ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయని.. వాటిని అభివృద్ధి కోసం ఖర్చు చేయడం లేదన్నారు. ఓటుకు వెయ్యి, రెండువేలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను పట్టించుకోవడం లేదని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో లక్షా 26వేల కిలోమీటర్ల రోడ్ల ఉంటే అందులో 26 కిలోమీటర్లలో కూడా గుంతలు లేని రోడ్లు లేవని ఎద్దేవా చేశారు.

  పవర్ లేని వాడు పవర్ స్టార్ కాదు..

  తన సభల్లో సీఎం సీఎం అని అరవొద్దని.. సీఎం అయిన తర్వాత సీఎం అనండి అని పవన్ కార్యకర్తలను వారించారు. సీఎం అవ్వాలనే కోరిక మనసులో పెట్టుకోండి.. సీఎంను చేయండిని పిలుపునిచ్చారు. పవర్ లేనివాడు పవర్ స్టార్ కాదని.. తనను జనసేనాని అని పిలవండి చాలు అన్నారు. తాను సరదాగా రాజకీయాలు చేయడం లేదు.. బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నాని పవన్ స్పష్టం చేశారు. తాను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని..., సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో పాలిటిక్స్ లోకి రాలేదన్నారు. రాజకీయ పార్టీని నడపడం అంత సులువుకాదని..., వేలకోట్లతో రాజకీయాలు చేస్తున్నవారున్నా.. రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. టీవీల్లో పచ్చిబూతులు తిట్టిస్తే భయపడతాననుకున్నారా..? పవన్ కల్యాణ్ గా నిలబడ్డానికి ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు తెలుసని గుర్తుచేశారు.

  ఇది చదవండి: ఏపీలో పెన్షన్ పోర్టబులిటీ.. ఇక నుంచి ఎక్కడైనా పెన్షన్ తీసుకోవచ్చు.. ఇలా చేయండి..


  సజ్జలకు కౌంటర్

  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పవన్ కౌంటర్ ఇచ్చారు. సజ్జల చెప్పినట్లు తాను యాక్షన్ కెమెరా కట్ అని చెప్పే వ్యక్తిని కాదు. మీ పార్టీలో అందరికంటే మీకే నాగురించే ఎక్కువ తెలుసన్న పవన్.. మీలాంటి వ్యక్తిలుండి కూడా రోడ్లు వేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న మీ నేత ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. సలహాదారు అంటే జనసేన నిరసనలను అడ్డుకోవమేనా అని ప్రశ్నించారు.

  ఇది చదవండి: ఆ విషయంలో జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత..? మొదటికే మోసం రానుందా..?  నేనంటే అంత భయమా..?

  తాను ధవళేశ్వరం, పుట్టపర్తికి వస్తున్నానంటే రాత్రికి రాత్రి రోడ్లు వేశారనని పవన్ అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా భయపెట్టేవారు, ప్రశ్నించేవారు లేకనే ఇష్టమొచ్చినట్లు చేస్తోందన్నారు. నిరసనల వల్ల రాజకీయ లబ్ధి వస్తుందని కాదు.. ప్రజలబాగు కోసం రోడ్లపైకి వస్తున్నానని పవన్ స్పష్టం చేశారు. తాను తిట్లుతినేది ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. నాకోసం నేను బ్రతికేవాడినేతై నన్ను తిట్టివాడిని కూర్చోబోట్టి నారతీసేవాడినని తీవ్రంగా హెచ్చరించారు. మానసికంగా దాడులు చేస్తున్నారు. ఇకపై పడేదిలేదు.., నా సహనాన్ని పిరికితనం.. చేతగాని తరం అని భావించొద్దని హెచ్చరించారు.

  అలాంటి వాళ్లే పార్టీలోకి రండి..

  పశ్చిమగోదావరి జిల్లా రావిపాడు ఎంపీటీసీ అభ్యర్థికి గ్లాసు గుర్తుపేరిట భీ ఫారం ఇస్తే... అతడు వైసీపీకి జై కొట్టాడు. కానీ అక్కడ జనసేన పార్టీ గెలిచింది. 20 ఏళ్లు జనసేనలో ఉంటేనే పార్టీలోకి రండి. మధ్యలో వచ్చివెళ్లేవ్యక్తులు అవసరం లేదన్నారు. నన్ను తూర్పుగోదావరి జిల్లాకు రాకుండా అడ్డుకోవాలని చూశారన్నార. నేను ఏమీ అనకపోయినా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి బూతులు తిట్టారు. జనసైనికులు నిరసన తెలిపేలోపు పోలీసులతో అడ్డుకున్నారు. అహంకారంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు నన్ను తిడుతున్నారు. ఏం పొడిచారని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు.

  మంత్రికి సెటైర్లు..

  ఇటీవల ఓ మంత్రి నాతో పాటు నేను పుట్టిన కులాన్ని కూడా కలిపి తిట్టారని పవన్ మండిపడ్డారు. నన్ను తిట్టాలంటే తిట్టండి.. జాతి ఏం చేసింది..? మీరు పుట్టిన కులాన్ని మీరే కించపరిస్తే పక్కకులాల వాళ్లు తిట్టకుండా ఉంటారా..? అని ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వీరమహిళలను టార్గెట్ చేసి దూషించారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడండని వార్నింగ్ ఇచ్చారు. నాలుగు కాదు ఐదో భాష కూడా నేర్చుకొని తిడతాని పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతలు కమ్మసామాజిక వర్గాన్ని శత్రువులుగా భావిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. చెత్తపై పన్ను, ఒకటో తారిఖున జీతాలు రావు, పెన్షన్లు రావని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి రాజకీయ సాధికారిత రావాలని పవన్ ఆకాంక్షించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

  ఉత్తమ కథలు