• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JANASENA CHIEF PAWAN KALYAN GETS PERMISSION FOR PUBLIC MEETING IN DIVIS LAB AFFECTED KOTHA PAKALA FROM EAST GODAVARI SP BA

Pawan Kalyan: జగన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జగన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన తన బహిరంగ సభకు పర్మిషన్ తెచ్చుకోగలిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా కొత్త పాకల గ్రామంలో దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తలపెట్టిన సభకు మొదట అనుమతి నిరాకరించిన పోలీసులు, ఆ తర్వాత అనుమతి తెలిపారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన తన బహిరంగ సభకు పర్మిషన్ తెచ్చుకోగలిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా కొత్త పాకల గ్రామంలో దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తలపెట్టిన సభకు మొదట అనుమతి నిరాకరించిన పోలీసులు, ఆ తర్వాత అనుమతి తెలిపారు. మొదట సభకు అనుమతి ఇచ్చిన జిల్లా ఎస్పీ, జనవరి 9న సభకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, అనుమతి లేదని చెప్పడంపై జనసేన తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. జగన్ ప్రభుత్వం మీరు విమర్శలు గుప్పించారు జనసేన నేతలు. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. అప్పుడు దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన జగన్.. ఇప్పుడు అదే పరిశ్రమకు మద్దుతగా నిలుస్తున్నారని, దాన్ని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్‌ సభను అడ్డుకోవడం అంటే దీని వెనుక ఏదో మతలబు ఉందనేలా జనసేన సోషల్ మీడియా విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో మరోసారి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నుంచి జనసేన నేతలకు సమాచారం అందింది. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు.

    ‘దివిస్ లాబొరేటరీస్ కాలుష్యంతో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటనకు కొత్త పాకల గ్రామంలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. శుక్రవారం రాత్రి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఫోన్ చేసి ఈ కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు ప్రకటించారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ శనివారం ఉదయం రాజమండ్రి చేరుకుంటానని కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు. అదేవిధంగా అనుమతి నిరాకరణను మనోహర్ ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై తమ అసంతృప్తిని తెలియజేశారు.’ అని ఓ ప్రకటనలో తెలిపింది.





    మొదట అనుమతి నిరాకరించిన జిల్లా ఎస్పీ.. ఆ తర్వాత పవన్ తాను ఎలాగైనా వచ్చి తీరుతానని ప్రకటించిన తర్వాత సభకు అనుమతి ఇస్తున్నట్టు నాదెండ్ల మనోహర్‌కు సమాచారం ఇచ్చారని జనసేన నేతలు చెబుతున్నారు.

    తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోని కొత్తపాకలలో దివీస్ ల్యాబ్ ఉంది. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కంపెనీ విస్తరణకు అనుమతులిచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ దివీస్ ల్యాబ్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలిపేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తీరా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అప్పుడు అనుమతి ఇచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. అప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు కంపెనీకి సానుకూలంగా ఉంది. దీంతో రైతులు, గ్రామస్తులు ‘జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.’ అంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ ప్రజలు దివీస్ కంపెనీ మీద దాడి చేశారు. అక్కడ తాత్కాలిక షెడ్లకు నిప్పు పెట్టారు. ఈ అంశంపై తాజాగా పవన్ కళ్యాన్ అక్కడకు వెళ్లాలని నిర్ణయించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: