జనసేన బలోపేతం కోసం... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

ఈరోజు నుంచే ఈ భేటీలు జరపాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు.

news18-telugu
Updated: July 29, 2019, 10:49 AM IST
జనసేన బలోపేతం కోసం... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
పవన్ కళ్యాణ్,
news18-telugu
Updated: July 29, 2019, 10:49 AM IST
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఆయన దృష్టి పెట్టారు. పార్టీ కమిటీలు, నేతలు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచే ఈ భేటీలు జరపాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.  మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు.

పార్టీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా కార్యకర్తలు, నేతలతో పవన్‌ చర్చిస్తారు. ఇవాళ  ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. రేపు  ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం భేటీ కానుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం భేటీ జరగనుంది. ఈనెల 31న అంటే బుధవారం ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశం జరగనుంది.

తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన ఒకే ఒక సీటులో గెలిచింది. ఇక పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పార్టీపై ఫోకస్ పెట్టిన పవన్ ...పార్టీని బలోపేతం చేసేందుకు అన్నివిధాలుగా ముందుకు వెళ్తున్నారు. అందుకు అవసరమైన మార్పుల్ని చకచక చేసుకుంటూ పోతున్నారు.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...