కాంగ్రెస్‌లో పవన్ కళ్యాణ్ వివాదం...సారీ చెప్పిన సీనియర్లు

అసలే రాజకీయంగా కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త చిచ్చు పెట్టారని తెలుస్తోంది.

news18-telugu
Updated: September 18, 2019, 12:18 PM IST
కాంగ్రెస్‌లో పవన్ కళ్యాణ్ వివాదం...సారీ చెప్పిన సీనియర్లు
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన ఏర్పాు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్‌తో రేవంత్ రెడ్డి కరచాలనం
news18-telugu
Updated: September 18, 2019, 12:18 PM IST
తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఊహించని వివాదం తలెత్తింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యాచరణపై జరిగిన చర్చ సందర్భంగా... కొందరు నేతలు పవన్ కళ్యాణ్ అంశాన్ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ మండిపడ్డారు. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని... ఈ వ్యవహారానికి పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఏంటని ఆయన కుంతియా సమక్షంలోనే పార్టీ పెద్దలను ప్రశ్నించారు.

కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపించాలని అనుకుంటున్నారని నేతలను నిలదీశారు. మనం పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ ఎఫ్పుడైనా వచ్చారా అని కూడా సంపత్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పార్టీలోని సీనియర్ నేతలు పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించడంతో... జనసేన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనని సీనియర్ నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చారు. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టినట్టే కనిపిస్తోంది.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...