జగన్ మతం, కులంపై... పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

జగన్ మతం, కులం అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. ఎవరైనా మతం మార్చకుంటే మళ్లీ కుల ప్రస్తావన రాకూడదన్నారు.

news18-telugu
Updated: December 2, 2019, 3:44 PM IST
జగన్ మతం, కులంపై... పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్, జగన్
  • Share this:
ప్రజల మధ్య గొడవలు పెడుతోంది హిందూ నాయకులేనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. హిందూ నాయకులంటే బీజేపీ వాళ్లు కాదన్నారు మళ్లీ బీజేపీ వాళ్లను విమర్శిస్తున్నానని నన్ను అనుకుంటారన్నారు పవన్. సమాజం అన్ని ధర్మాలను సంరక్షించాలన్నారు.
అన్నికులాల్ని, మతాల్ని సమానంగా గౌరవించాలన్నారు పవన్. ఏడుకొండల వాడి సన్నిధిలో చెబుతున్నా నేను ధర్మానికి నిలబడే వ్యక్తి
అన్నారు పవన్. ధర్మం అంటే ఎదుటివారి ధర్మాన్ని నరికివేయడం కాదన్నారు. తన ధర్మాన్ని సంరక్షించి ఎదుటవారి ధర్మాన్ని వాడాలన్నారు.

ఈ సందర్భంగా జగన్ మతం, కులం అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. ఎవరైనా మతం మార్చకుంటే మళ్లీ కుల ప్రస్తావన రాకూడదన్నారు. రెడ్డి, కమ్మ,బలిజ, కాపు హిందూ ధర్మం నుంచి వచ్చిన కులాలే అన్నారు. మతం మారిన కులాల ప్రస్తావన రాకూడదన్నారు. తాను మిషనరీ స్కూల్లో చదివానన్నారు. క్రైస్తవులంతా ఎంతో సహనంగా ఉంటారన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డికి మాత్రం సహనం లేదన్నారు. చెట్టు మీదే సహనం లేనివాడు మనుషులపై ఏం సహనం చూపిస్తారని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. తన పేరు వెనుక నాయుడు లేదన్నారు. వైసీప వాళ్లు తనకు ఆ పేరు పెట్టారన్నారు. జగన్ కులం మతం మారింది కానీ... రంగులు మాత్రం మారడం లేదంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మొత్తం మీద వైసీపీది రంగుల రాజ్యమంటూ పవన్ విమర్శలు గుప్పించారు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>