Pawankalyan–MK Stalin: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) సహా ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో చూస్తున్నాం. అధికార- విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఒకటంటే.. విపక్షాలు మరో మాట అంటాయి. ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయానికే తావుండడం లేదు. ప్రభుత్వాలు తాము చేసింది కరెక్టు అంటూ చెబుతుంటాయి.. ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది అంటూ విపక్షాలు విమర్శిస్తుంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అయితే అధికార, ప్రతిపక్షాల పక్ష మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏపీలో రాజకీయం అయితే మరో లెవెల్లో ఉంటోంది. ప్రభుత్వం తమది సంక్షేమ పాలన అంటుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. విపక్షాలన్నీ మాత్రం ఏపీలో రాక్షస పాలన సాగుతోంది అంటూ విమర్శిస్తుంటాయి. అసలు ఏం సందర్భంలోనూ విపక్షాలు చెప్పిన మాటను ప్రభుత్వం పట్టించుకున్న పాపానికి పోలేదు. రాజకీయ పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చినా తరువాత.. ఆ రాజకీయాలను పక్కన పెట్టి.. పాలన కోసం అందర్నీ కలుపుకొని వెళ్లాలి.. ప్రజలకు మేలు జరిగేలా చూడాలి.. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటివి దాదాపు అసాధ్యం.. గతంలో ఏదైతే జరిగిందో.. ఇప్పుడూ అదే కొనసాగుతోంది..
తాజాగా జనసేన (janasena)అధినేత పవన్ కళ్యాణ్ (PawanKalyan)సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని చాలామంది మాటల్లో చెపుతారు కానీ.. తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) మాత్రం దీన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారంటూ ప్రశంసించారు.
అందుకే స్టాలిన్ పరిపానలన, ప్రభుత్వ పని తీరు తమిళనాడు రాష్ట్రానికే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. అందుకే మీకు మనస్ఫూర్తిగా తన అభినందనలు తెలియచేస్తున్నాను అంటూ పవన్ ట్వీట్ చేశారు.
To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT
— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021
మరోవైపు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విమర్శలకే పరిమితమైన జనసేన మళ్లీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జనసేన పార్టీ మళ్లీ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరకాన్ని తలపిస్తున్న రోడ్ల మరమ్మతుల కోసం జనసేన పోరాటానికి సిద్ధమైంది.
Every step there is a pothole… Every yard there is a pit! - JanaSena Chief Shri @PawanKalyan #JSPForAP_Roads pic.twitter.com/6st4mDVfQh
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2021
ఇదిలా ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జెండా స్థూపం నిరసన కొనసాగుతోంది. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో జనసేన పార్టీ జెండా స్థూపం నిర్మాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలే కావాలని అడ్డుకుంటున్నారని జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, MK Stalin, Pawan kalyan