Pawan kalyan: తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది.. అప్పటి వరకు రావద్దని అనుకున్న.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ (ఫైల్)

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెలంగాణలోని యాక్టివ్ జనసైనికులు, నాయకులతో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్‌ ప్రసంగించారు.

  • Share this:
    తెలంగాణ రాజకీయాలకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెలంగాణలోని యాక్టివ్ జనసైనికులు, నాయకులతో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్‌ ప్రసంగించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని పవన్‌ వ్యాఖ్యానించారు. 2009లో తెలంగాణ మొత్తం తిరిగానని చెప్పారు. రాజకీయాల్లో వస్తుంటే అందరూ తనను భయపెట్టారని.. కానీ తెలంగాణ గడ్డ తనకు ధైర్యం ఇచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. దెబ్బ‌కొట్టేకొద్దీ మ‌రింత ఎదుగుతానని చెప్పారు. రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే ఎంతో ఆలోచించాలని.. అన్నింటికీ సిద్ధ‌ప‌డే రాజ‌కీయాల్లోకి వ‌చ్చానని చెప్పారు. అయితే 2009లో రాజకీయాలు తన ఆధీనంలో లేవని అన్నారు. అప్పుడు పార్టీ వేరొకరి చేతిలో ఉందని చెప్పారు. రాజకీయ చదరంగంలో జనసేనది (Janasena Party) సాహసోపేత అడుగు అని చెప్పారు. తెలంగాణ పోరాట స్ఫూర్తే తనను నడిపిస్తోందని అన్నారు.

    తాను తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయాలు చేయాలంటే బలమైన భావజాలం ఉంటే చాలు అని అన్నారు. అయితే రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమని అన్నారు. తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై నుంచే జనసేన పార్టీని ప్రారంబించానని గుర్తుచేశారు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయని, కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. కులాల కొట్లాటతో ఏపీ అభివృద్ధి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాష్టీకం, దౌర్జన్యం, అవినీతి, పేదరికంపైనే తమ పోరాటం అన్నారు. తెలంగాణ యాసను, భాషను తాను గౌరవిస్తాను అని చెప్పారు. ప్రాంతీయతను విస్మరించకూడదని ప్రాంతాన్ని, నేలాన్ని విస్మరించినప్పుడు కోపం తప్పుకుండా వస్తుందని అన్నారు. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఉండాలని అన్నారు.

    Hyderabad Rains: సినిమా థియేటర్‌ను ముంచెత్తిన వరద నీరు.. ప్రేక్షకులకు భారీ షాక్.. ప్రహరీ గోడ కూలి..

    ‘ఇంతకాలం తెలంగాణకు ఎందుకు రాలేదని చాలా మంది అడిగారు. తెలంగాణ ప్రజలు పిలిచేవరకు నేను రాను. మీ అనుమతి కావాలి నాకు. తెలంగాణ నేల మీద నాకున్న ప్రేమ మీరు ఊహించలేరు. ప్రజలు అడిగినప్పుడు వస్తాను. రెండేళ్ల క్రితం నల్లమల్ల అడువుల నుంచి శివ అనే 17 ఏళ్ల కుర్రాడు, మరో వ్యక్తి.. హైదరాబాద్‌లోని ఆఫీస్‌లోనికి వెళ్తుంటే కనిపించారు. లోపలికి పిలస్తే.. వారి గ్రామాల్లో యూరేనియం సమస్యపై మాట్లాడాడు. ఇంటర్ చదివే ఆ 17 ఏళ్ల కుర్రాడికి చైతన్యం కల్పించింది తెలంగాణ నేల. ఆ ఘటన నన్ను కదిపేసింది’అని పవన్ కల్యాణ్ అన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: