కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి... జగన్ పార్టీపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

తెలుగు మీడియంను వైసీపీ రద్దు చేస్తుంటే ఏపీలో అధికార భాషా సంఘం ఏం చేస్తుందంటూ పవన్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: November 10, 2019, 2:08 PM IST
కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి... జగన్ పార్టీపై పవన్ ఘాటు వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్
news18-telugu
Updated: November 10, 2019, 2:08 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేడి రాజేసింది.  ఇప్పటికే అనేకమంది ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. విమర్శలు కూడా గుప్పించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మండిపడ్డారు. తెలుగు మీడియంను వైసీపీ రద్దు చేస్తుంటే ఏపీలో అధికార భాషా సంఘం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు . భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వైసీపీ లీడర్లు నేర్చుకోవాలని అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసిఆర్ తెలుగు భాషను కాపాడడం కోసం కృషి చేస్తున్నట్టుల పవన్ ఈ సంధర్భంగా చెప్పుకొచ్చారు. 2017లో జరిగిన తెలుగు మహా సభలను గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేస్తే మన భాష, సంస్కృతి మరుగున పడిపోతాయని పవన్‌ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...