కొడితే కొట్టించుకోమని చెబుతున్నారా?... కోటంరెడ్డి కేసుపై పవన్ కళ్యాణ్ కామెంట్స్

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై బెయిల్ సులువుగా ఇచ్చే 448 , 427 , 506 , 290 వంటి నమోదు చేసి ఈ కేసును పోలీసుల ద్వారా ప్రభుత్వం నీరుగార్చేసిందని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు.

news18-telugu
Updated: October 7, 2019, 4:15 PM IST
కొడితే కొట్టించుకోమని చెబుతున్నారా?... కోటంరెడ్డి కేసుపై పవన్ కళ్యాణ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
news18-telugu
Updated: October 7, 2019, 4:15 PM IST
వెంకటపాలెం ఎంపీడీఓ సరళపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు చింతమనేని... వనజాక్షి మీద దాడి చేస్తే, ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. సరళ మీద దాడి చేశారని, ఇద్దరికీ పెద్ద తేడా లేదన్నారు. పైగా అప్పుడు ప్రభుత్వం చింతమనేని కేసును నీరుగారిస్తే, ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం స్వల్ప కేసులు పెట్టి కోటంరెడ్డి కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ‘కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీఓ సరళ మీద దాడి చేస్తే వైసీపీ ఎందుకు ఖండించలేదు? శ్రీధర్ రెడ్డిపై తీవ్రమైన చర్యలకు ఎందుకు డిమాండ్ చేయలేదు? సరళ పెట్టిన కేసును నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం సందేశం ఇస్తుంది? మా ఎమ్మెల్యేలు దాడులు చేస్తారు. మీరు భరించండి అని చెబుతున్నారా?’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై బెయిల్ సులువుగా ఇచ్చే 448 , 427 , 506 , 290 వంటి నమోదు చేసి ఈ కేసును పోలీసుల ద్వారా ప్రభుత్వం నీరుగార్చేసిందని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడవలసిన భాద్యత జగన్ రెడ్డి ప్రభుత్వంపై వుందని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేనాని డిమాండ్ చేశారు.

ప్రెగ్నెంట్‌గా భర్త ఫొటో షూట్.. ఫిదా అవుతున్న అమ్మాయిలు...


First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...