హోమ్ /వార్తలు /రాజకీయం /

Pawan Kalyan-Tollywood : టాలీవుడ్ లో పవన్ వ్యాఖ్యల దుమారం.. నిర్మాతల్లో టెన్షన్..

Pawan Kalyan-Tollywood : టాలీవుడ్ లో పవన్ వ్యాఖ్యల దుమారం.. నిర్మాతల్లో టెన్షన్..

పవన్ కల్యాణ్ (ఫైల్)

పవన్ కల్యాణ్ (ఫైల్)

టాలీవుడ్ (Tollywood) లో ఇప్పుడు ఏ ఇద్ద‌రు క‌లిసినా ఒకటే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కోవిడ్ కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ దారుణంగా న‌ష్ట‌పోయింది. థియేట‌ర్ వ్య‌వ‌స్థ గురించి అయితే ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్రస్తుతం వాటి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

ఇంకా చదవండి ...

M. Bala Krishna, Hyderabad, News18

టాలీవుడ్ (Tollywood) లో ఇప్పుడు ఏ ఇద్ద‌రు క‌లిసినా ఒకటే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కోవిడ్ కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ దారుణంగా న‌ష్ట‌పోయింది. థియేట‌ర్ వ్య‌వ‌స్థ గురించి అయితే ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్రస్తుతం వాటి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం (Andhra Pradesh Government) తీసుకున్ననిర్ణ‌యం కూడా ఇప్పుడు సినిమా ప‌రిశ్ర‌మ‌పై మూలిగే న‌క్క‌పై తాటి పండు ప‌డిన‌ట్లు అయింది. అయితే తాజాగా జనసేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు పొలిటిక‌ల్ గా ఎంత దుమారం లేక‌పోయిన సినిమా ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌ల‌కు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టాలీవుడ్ కు సంక్రాంతి స‌మ‌యం అత్యంత కీల‌క‌మైన సమయంగా భావిస్తారు. ఈ సమ‌యంలో త‌మ సినిమాలు విడుదల చేస్తే.. నాలుగు రాళ్లు వెన‌కేసుకుంటారు అనే న‌మ్మ‌కం నిర్మాతల్లో ఉంది.

అయితే ఇప్పుడు ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మంలో పెద్ద చ‌ర్చ‌కు దారితీశాయి. జ‌న‌సేన అధినేత హోదాలో ప‌వ‌న్ అమ‌రావ‌తి వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌లు ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు ద‌ర్శ‌కనిర్మాతలకు దడ పుట్టిస్తున్నాయి. ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్లు అమ్మకానికి సంబంధించి చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి బ‌హిరంగ వేదికపైన.. ట్విట్ట‌ర్ ద్వారా ఏపీ సీఎం జ‌గ‌న్ కు ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని అభ్య‌ర్ధించిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి: ఏపీలో పెన్షన్ల పెంపు.. వృద్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..


అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ టిక్కెట్ల అమ్మ‌కంలో పార‌ద‌ర్శ‌క‌త లేదంటున్నారు. అస‌లు ప్ర‌భుత్వం అమ్మ‌తున్న మ‌ద్యం అమ్మాకాల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉందా ఉంటే ఎందుకు అన్ని సార్లు కోర్టులు చుట్టు తీరుగుతున్నారాని ప్ర‌శ్నించారు. అంతేకాదు ప్రభుత్వం పంతానికి పోతే ఏపీలో త‌న సినిమాలు ఉచితంగా ఆడిస్తాన‌నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానిక‌రం అంటూ ఘాటుగానే విమర్శించారు.

ఇది చదవండి: మీతో మాకు గొడవలొద్దు.. తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం..


ఇప్పుడు ప‌వ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌లుల‌తో సినిమా ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌లు తల‌లు ప‌ట్టుకుంటున్నారు. కొన్ని పెద్ద సినిమాల విషయంలో టికెట్ రేట్లను పెంచాలంటూ నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సమయంలో పవన్ కామెంట్స్ తో ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. అలాగే బెనిఫిట్ షోల‌కు గ్రీన్ సిగ్న‌ల్ అచ్చే అంశం కూడా ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

ఇది చదవండి: వైసీపీలోని ఆ నేతల నుంచే జగన్ కు ప్రాణహాని.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..


డిసెంబ‌ర్ 17 నుంచి పెద్ద సినిమాల సినిమాల విడుదల ప్రారంభమవుతుంది. పుష్ప పార్ట్ -1తో మొదలయ్యే సినిమా పండుగ.. నాని సినిమా శ్యామ్ సింగ‌రాయ్, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయ‌క్, రాధేశ్యామ్, ఆచార్య, బంగార్రాజు వరకు కొనసాగనుంది. ఇలాంటి తరుణంలో ప‌వ‌న్ కల్యాణ్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై పలువురు నిర్మాలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు సినిమా వ‌ర్గాల స‌మాచారం. ఐతే సినిమాలను లైన్లో పెట్టిన ప్రొడ్యూసర్లు మాత్రం పాలిటిక్స్ ను పట్టించుకోకుండా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇది చదవండి: ఏపీ కేబినెట్ మార్పుల్లో ట్విస్ట్..! ఆ ఎనిమిది మంది చుట్టూనే రాజకీయం..


మరి ఏపీ ప్రభుత్వం ప‌వ‌న్ కోణంలో ప‌రిశ్ర‌మ మొత్తం ప్ర‌భావితం అయ్యేలా నిర్ణ‌యం తీసుకుంటుందా..? లేక ఎక్కువ మంది ప్ర‌యోజ‌నాలు కాపాడేలా ముందుకు వ‌స్తుందా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

First published:

Tags: Andhra Pradesh, Pawan kalyan, Tollywood

ఉత్తమ కథలు