Andhra Pradesh: బీజేపీతో పొత్తుకు అదే కారణం.. తిరుపతి అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

తిరుపతి బీజేపీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చిన పవన్

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడంపై జనసైనికులు ఆగ్రహంతో ఉన్నారా? స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి ఎలా ప్రచారం చేస్తామని అధినేతను ప్రశ్నిస్తున్నారా.? అందుకేనా జనసైనికులకు పవన్ అంతలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటూ ప్రచారం జరుగుతోంది.

  • Share this:
    అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి చేతెలెత్తేశారు అన్నట్టు ఉందని కొందరు జనసైనికులు మండిపడుతున్నట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ అభ్యర్థే ఉంటాడని.. గెలుపు కోసం పని చేద్దామని జనసేన కార్యకర్తలు చాలా హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.  కానీ చివరి.. బీజేపీకి జై కొట్టాల్సిన పరిస్థితి రావడంపై అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా తిరుపతిలో మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటే.. లేదు తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటూ.. బీజేపీ, జనసేనలు ప్రచారం చేసుకున్నాయి. కానీ చివరకు బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థి అని తేలిపోయింది.

    తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థి ఎంపికపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ మంతనాలు జరిపారని, ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థిని తిరుపతి ఉప ఎన్నికలో నిలబెట్టాలని ఏకగ్రవంగా నిర్ణయించినట్లు పార్టీ ఇంఛార్జ్ మురళీధరన్ ట్విట్టర్ లో వెల్లడించారు. దీంతో జనసేన అభిమానులు, కార్యకర్తల్లో అసహనం మొదలైనట్టు తెలుస్తోంది. జనసేన అభ్యర్థి నిలబెడితే గెలుపు అవకాశాలు ఉండేవని.. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని చెప్పిన బీజేపీ అభ్యర్థి తరపున ఎలా ప్రచారం చేస్తామంటూ స్థానిక నేతలు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

    తిరుపతి ఉపఎన్నిక ద్వారా వైసీపీ ఆగడాలకు దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పవన్. బీజేపీ జాతీయ స్థాయి నేతలతో చర్చల తర్వాతనే తిరుపతి ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిని బలపరిచినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో విజయం కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధే తనకు ముఖ్యమైనదని భావించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    ఇదీ చదవండి:తమ్ముడి కోసమే మెగాస్టార్ గళమెత్తారా? స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చిరంజీవి జైకొట్టడానికి అదే కారణమా?

    రాష్ట్ర ప్రగతి, శాంతి భద్రతల పరిరక్షణకు తాము తీసుకున్న నిర్ణయం మేలు చేస్తుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యుడైన, బలమైన అభ్యర్థి ఉన్నట్లయితే తప్పకుండా ఆ స్థానాన్ని బీజేపీకి అప్పగిస్తామని మొదట్నుంచీ చెప్తూ వచ్చినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు బీజేపీ తగు చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం ఉందన్నారు. జనసేన పార్టీ తరఫున ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంస్థాగతంగా బలపడేందుకే అనే విషయాన్ని కార్యకర్తలు గమనించాలని పవన్ కోరారు. రాష్ట్రంలోని అరాచక శక్తులను ఎదుర్కొనేందుకే బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.
    Published by:Nagesh Paina
    First published: