హోమ్ /వార్తలు /politics /

Pawan Kalyan: వైసీపీ, టీడీపీని ఒకేసారి టార్గెట్ చేసిన పవన్.. డిజిటల్ ఉద్యమానికి పిలుపు.. కారణం ఇదే..!

Pawan Kalyan: వైసీపీ, టీడీపీని ఒకేసారి టార్గెట్ చేసిన పవన్.. డిజిటల్ ఉద్యమానికి పిలుపు.. కారణం ఇదే..!

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఏం చెప్పాలి..? ఈయన క్రేజ్ కొలవాలంటే కొత్త పరికరం ఏదైనా కనిపెట్టాల్సిందే. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ ఈయనది. ఎప్పుడో ఆ రేంజ్ దాటిపోయాడు పవర్ స్టార్. హిట్లు, ఫ్లాపులు పక్కనబెట్టండి.. ముందు ఆయన సినిమా వస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ ఉంటారు. అంత క్రేజ్ పవన్ అంటే అభిమానులకు. అలాగే దర్శక నిర్మాతలకు కూడా పవన్‌తో సినిమా చేయాలని అంతే కలలు కంటుంటారు.

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఏం చెప్పాలి..? ఈయన క్రేజ్ కొలవాలంటే కొత్త పరికరం ఏదైనా కనిపెట్టాల్సిందే. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ ఈయనది. ఎప్పుడో ఆ రేంజ్ దాటిపోయాడు పవర్ స్టార్. హిట్లు, ఫ్లాపులు పక్కనబెట్టండి.. ముందు ఆయన సినిమా వస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ ఉంటారు. అంత క్రేజ్ పవన్ అంటే అభిమానులకు. అలాగే దర్శక నిర్మాతలకు కూడా పవన్‌తో సినిమా చేయాలని అంతే కలలు కంటుంటారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel plant Privatization) అంశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) ని జనసేన పార్టీ (Janasena Party) టార్గెట్ చేసింది. రెండు పార్టీల ఎంపీలు పార్లమెంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనత్తడంలో విఫమలయ్యాయంటూ ఆ రెండు పార్టీలపై డిజిటల్ ఉద్యమానికి పిలుపునిచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan).

ఇంకా చదవండి ...

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel plant Privatization) అంశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) ని జనసేన పార్టీ (Janasena Party) టార్గెట్ చేసింది. రెండు పార్టీల ఎంపీలు పార్లమెంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనత్తడంలో విఫమలయ్యాయంటూ ఆ రెండు పార్టీలపై డిజిటల్ ఉద్యమానికి పిలుపునిచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan). ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన పవన్.. ఏపీలో అధికార పార్టీపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వైసీపీపై మండిపడ్డ ఆయన.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో ఉందని విమర్సించారు. . వారికి బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజిటల్ క్యాంపెయిన్ సాగించాలని పవన్ పిలుపునిచ్చారు.

వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలు కూడా పార్లమెంటులో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలని.. ప్లకార్డులు ప్రదర్శించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలన్న బాధ్యతను వారికి తెలిపేలా ఏపీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని పవన్ అన్నారు.

ఇది చదవండి: ఎర్రచందనం ‘పుష్ప’ స్టోరీ ఎలా అయింది..? సుకుమార్ కు నచ్చిన పాయింట్స్ ఇవేనా...?


ఈనెల 18వ తేదీ ఉదయం 10గం.కు మన రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నట్లు పవన్ తెలిపారు. అలాగే ప్రజలు, జనసైనికులు తమ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన ప్రతి లోక్ సభ ఎంపీకి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయాలని పిలుపునిచ్చారు.

ఇది చదవండి: రోజాకు చెక్ పెట్టేందుకు అసమ్మతి వర్గం స్కెచ్.. ఫైర్ బ్రాండ్ ధైర్యంగా ఎదుర్కొంటారా..?


ఎంతో మంది బలిదానాలు, త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడమే ఈ డిజిటల్ ఉద్యమం ఉద్దేశమని పవన్ స్పష్టం చేశారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదం ప్రతి ఆంధ్రుడినీ కదిలించిందన్న పవన్ ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశారు. జై తెలంగాణ అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో అలాంటిదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం కూడా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలసి రావాల్సిన సమయం ఇది అని అభిప్రాయపడ్డారు.

ఇది చదవండి: ఏపీలో చాపకింద నీరులా ఒమిక్రాన్..? కోనసీమలో కొత్త వేరియంట్ కలకలం..!


స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా 18, 19, 20 తేదీల్లో పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం జనసేనకు ఉంది అనిపించిందని పవన్ అన్నారు. “వైసీపీ, టీడీపీల ఎంపీలకు జనసేన పార్టీ నుంచి ఇదే మా విన్నపం. మీరు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన బాధ్యతను స్వీకరించి వైసీపీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఇంతకు ముందు కూడా కోరాము. వారు స్పందించలేదు. వైసీపీ నాయకత్వానికి మా మరో విన్నపం. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మీతో కలసి నడవడానికి మేము సంసిద్ధతతో ఉన్నాం” అని పవన్ ప్రకటించారు.

First published:

Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan, Vizag Steel Plant

ఉత్తమ కథలు