JANASENA CHIEF PAWAN KALYAN AND AP MINISTER PERNI NANI INVOLVED IN TWITTER AS POLITICAL WAR TOUCHES PEAKS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Pawan Kalyan VS Perni Nani: పవన్-పేర్ని నాని మధ్య ట్వీట్ల వార్.., ఎవరూ తగ్గట్లేదుగా..!
పవన్ కల్యాణ్, పేర్ని నాని (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) జనసేన-వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ-వైసీపీకి మించి జనసేన-వైసీపీ మధ్య వార్ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) జనసేన-వైఎస్ఆర్సీపీ (Janasena-YSRCP) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ-వైసీపీ (TDP_YCP)కి మించి జనసేన-వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో (Republic Move pre-Release Event)జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన కామెంట్స్ ఇటు రాజీయాల్లో, అటు టాలీవుడ్ (Tollywood) లో ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలకు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు. పనన్ సినిమాలను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని.. పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఐతే మంత్రి వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడున్నారు. కాపు సంఘాలు కూడా తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ ను విమర్శించడంతో వాతావరణం వేడెక్కింది.
సినిమా టికెట్లు ఆన్ లైన్ చేస్తే పవన్ కు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. అలాగే వైసీపీ మంత్రులు తప్పులు చేస్తే కేసులు పెట్టాలిగానీ ఇష్టమొచ్చినట్లు తిడతారా..? అని నిలదీశారు. ఫిల్మ్ ఛాంబర్ కూడా పవన్ కామెంట్స్ తో సంబంధం లేదని చెప్పగా.. హీరోలు నాని, కార్తికేయ ఆయన వ్యాఖ్యలను సమర్ధించారు.
ఇదిలా ఉంటే వైసీపీ మంత్రుల విమర్శలు, పోసాని ప్రెస్ మీట్ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ మరింత రచ్చ రేపుతోంది. వైసీపీ నేతల విమర్శలను లైట్ తీసుకున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. “తుమ్మెదల ఝుంకారాలు నెమళ్ళ క్రేంకారాలు ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే …” అని పవన్ ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు Who let the dog out అనే పాటను కూడా ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు పవన్.
పవన్ అలా ట్వీట్ చేశారో లేదో మంత్రి పేర్ని నాని కూడా కౌంటర్ ట్వీట్ తో రెడీ అయిపోయారు. “జనం ఛీత్కారాలు ఓటర్ల తిరస్కారాలు తమరి వైవాహిక సంస్కారాలు వరాహ సమానులకు న'మస్కా'రాలు” అంటూ పవన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో డైరెక్ట్ గానే కాదు సోషల్ మీడియాలోనూ రెండు పార్టీల మధ్య వార్ తారాస్థాయికి చేరింది.
ఇక పేర్ని నాని ట్వీట్ చేసిన కాసేపటికే పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ వదిలారు. “వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..” అంతకు ముందు వైసీపీ ఇచ్చిన హామీలు.. ఇప్పుడు చేస్తున్న పనులతో కూడిన వివరాలను కూడా పవన్ ట్వీట్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..
అటు వైసీపీ.. ఇటు జనసేన రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. సినిమా టికెట్ల దగ్గర మొదలైన వ్యవహారం సోషల్ మీడియా వార్ కు దారి తీసింది. విమర్శలు, ప్రతివిమర్శలతో రెండు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.