విశాఖ ఉత్తరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థీ, మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..తాను పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఖచ్చితంగా..గెలుస్తానని..అంతేకాదు..జనసేన అధినేత పవన్ కల్యాన్ స్వయంగా వచ్చి పోటీ చేసిన..గెలుపు నాదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో జరగబోయో ఎన్నికల్లో భారీ మెజారిటీతో తాను విజయం సాధిస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రచారంలో భాగంగా.. విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి గంటా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. అంతేకాదు..అదే ఏపీలో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే తాను కూడా మంచి మేజారీటీతో గెలుస్తానని... తన గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని, అందరి చూపూ ఎంత మెజార్టీ వస్తందన్న అంశంపైనే అన్నారు. ఇంతకు ముందు వచ్చిన మెజార్టీలను మించి ఈసారీ వస్తుందని, ఏపీలో టీడీపీకే ప్రజలు పట్టం కడతారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Ganta srinivasa rao, Pawan kalyan, Visakhapatnam S01p04