• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JANASENA CHIEF AND POWER STAR PAWN KALYAN RECOVERED FROM CORONA VIRUS AS RTPCT TEST GIVE NEGATIVE REPORT FULL DETAILS HERE PRN

Pawan Kalyan Health: పవన్ హెల్త్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే.. గుడ్ న్యూస్ చెప్పిన వకీల్ సాబ్

Pawan Kalyan Health: పవన్ హెల్త్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే.. గుడ్ న్యూస్ చెప్పిన వకీల్ సాబ్

పవన్ కల్యాణ్ (ఫైల్)

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్యంపై కొంతకాలంగా ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఐతే సస్పెన్స్ కు పవన్ తెరదించారు.

  • Share this:
    జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కొద్దిరోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు వారాలుగా ఆయన తన ఫామ్ హౌస్ లో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఐతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో జనసేన కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులు ఆందోళన చెందారు. ఐతే వారందరికీ పవన్ శుభవార్త చెప్పారు. పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం పవన్ బాగానే ఉన్నారని.. కాకపోతే కాస్త నీరసంగా ఉన్నరని జనసేన తెలిపింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కరోనా బారిన పడ్డారు. తొలుత ఆయన సెక్యూరిటీ సిబ్బందికి వైరస్ సోకింది. తర్వాత పవన్ కు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన సొంత వ్యవసాయక్షేత్రంలో చికిత్స తీసుకుంటున్నారు.

    పవన్ కల్యాణ్ కు వ్యక్తిగత వైద్యుడితో పాటు అపోలో హాస్పిటల్స్ కు చెందిన వైద్య బృందం ట్రీట్ మెంట్ అందించింది. తాజాగా పవన్ కు నెగెటివ్ రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఐతే పవన్ కు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మరోవైపు తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతిఒక్కరికీ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులు ఇచ్చే సూచనలు పాటించాలని పవన్ పిలుపునిచ్చారు..



    కరోనా సోకడంతో పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించిన చివరి ప్రచార సభలో పవన్ పాల్గొనలేకపోయారు. ఐతే పవన్ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఓటమి పాలయ్యారు. ఓవైపు కరోనాతో ఇబ్బంది పడుతున్నా.. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.







    ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లుతో పాటు మలయాళం సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నారు.
    Published by:Purna Chandra
    First published: