జనసేన - బీజేపీ పోరాటం స్టార్ట్... ఫిబ్రవరి 2న...

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన - బీజేపీ కూటమి పోరాటాన్ని మొదలు పెట్టింది. అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు.

news18-telugu
Updated: January 22, 2020, 7:21 PM IST
జనసేన - బీజేపీ పోరాటం స్టార్ట్... ఫిబ్రవరి 2న...
పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన - బీజేపీ కూటమి పోరాటాన్ని మొదలు పెట్టింది. అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. బీజేపీ - జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాన్, కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహన్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి వంటి నేతలు చర్చించారు. అనంతరం వారు ఈ అంశాలను మీడియాకు వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఓసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 28న మరోసారి తాము భేటీ అవుతామని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఇకపై ధర్నాలు, ఆందోళనలు ఏం చేసినా ఇద్దరూ కలిసే చేయాలని నిర్ణయించామన్నారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించినట్టు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఏపీలో రెండు పార్టీలు కలిసి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణ గురించి జేపీ నడ్డాకు తాము తెలియజేస్తామన్నారు. జనసేన పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాము కేవలం బీజేపీతో పొత్తుమాత్రమే పెట్టుకున్నామన్నారు.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు