ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఇరు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు భేషరతుగా పవన్ అంగీకరించారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లో ఇది చారిత్రాత్మకమైన రోజని ఆయన చెప్పారు. ప్రజల సమస్యలపై ఇకపై ఉమ్మడిగా కలిసి పోరాడతామని.. ఏపీలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
విజయవాడ వేదికగా బీజేపీ, జనసేన పొత్తకు సంబంధించి కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, పురంధేశ్వరి, సోము వీర్రాజు హాజరయ్యారు. ఇక జనసేన తరపున సమావేశంలో పాల్గొనేందుకు పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap bjp, AP News, Janasena, Pawan kalyan