హోమ్ /వార్తలు /రాజకీయం /

పవన్ బీజేపీ పెద్దలను కలవడానికి కారణమిదే..?

పవన్ బీజేపీ పెద్దలను కలవడానికి కారణమిదే..?

బీజేపీ, జనసేన

బీజేపీ, జనసేన

పవన్ కల్యాణ్ అమరావతి అంశంపైనే మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్తే ప్రభుత్వ పెద్దలను కలవాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వారికి వివరించాలి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ హైకమాండ్‌ను కలిశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిలో రైతుల ఆందోళనలు, అమరావతి పరిరక్షణ సమితి యాత్ర జరుగుతున్న వేళ పవన్ ఢిల్లీలో పర్యటించడం వెనక కారమేంటని జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారం ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్.. సోమవారం బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జేపీ నడ్డాతో పవన్ సమావేశమయ్యారు. సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాజధాని మార్పు, అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. ఆ తర్వాత బీజేపీ ఏపీ ఇంచార్జి వి.మురళీధరన్, కో ఇంచార్జి సునీల్ డియోదర్, ఎంపీ తేజస్వి సూర్యతోనూ పవన్ భేటీ అయ్యారు.

పవన్ కల్యాణ్ అమరావతి అంశంపైనే మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్తే ప్రభుత్వ పెద్దలను కలవాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వారికి వివరించాలి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ హైకమాండ్‌ను కలిశారు. జేపీ నడ్డాతో పాటు ఏపీ బీజేపీ ఇంచార్జితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ టూర్ వెనక రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సమావేశంలో జనసేన, బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరుపార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇకపై జరిగే కార్యక్రమాలన్నీ జనసేన-బీజేపీ కలిసి ఉమ్మడిగా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు అమరావతి అంశంపైనా ఇరు పార్టీలు ప్రత్యేక కార్యచరణ రూపొందిచాలని యోచిస్తున్నట్లు సమాచారం.

First published:

Tags: Amaravati, AP News, Bjp, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు