JANASENA AND BJP LEADERS MET GOVERNOR BISWABHUSHAN HARICHANDAN AND MADE SENSATIONAL ALLEGATIONS ON YSCRCP PRN
AP Panchayat Elections: గ్రామ వాలంటీర్లతో బెదిరిస్తున్నారు... సీఎం జగన్ పై పవన్ పార్టీ సంచలన ఆరోపణలు
పవన్ కళ్యాణ్, జగన్ (ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వాతావారణం వేడెక్కింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలకు రంగం సిద్దం చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వాతావారణం వేడెక్కింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలకు రంగం సిద్దం చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన జనసేన, బీజేపీ పార్టీలు.., వైసీపీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాయి. అధికారం ఉందన్న అహంకారంతో వైసీపీ.., ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. అంతేకాదు గ్రామ వాలంటీర్ల సాయంతో బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆన్ లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరించాలని కోరాయి.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గవర్నర్ కు వివరించినట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతంలో నామినేషన్ లు కూడా వేయకుండా అధికార పార్టీ అడ్డుకున్నాని., ఈ సారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలని కోరినట్లు వివరించారు. ఏకగ్రీవాలు సహజమే అయినా... ప్రలోభ పెట్టి, భయపెట్టి చేయాలని చూస్తున్నారని మండిపడ్డ మనోహర్.., ఇప్పటికే పలు ప్రాంతాల్ జరిగిన ఘటనలను గవర్నర్ కు వివరించామన్నారు. ఇక వైసీపీ నేతలు గ్రామ వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ అరాచకాలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ సారి అలా జరగకుండా చూడాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాని కోరామన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తో వ్యవహరిస్తుందని.., ఎక్కడా కూడా సిట్ వేసి.. విచారణ వేగ వంతం కూడా చేయలేదని సోము విమర్శించారు. ఆలయాలను పట్టించుకోని ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిందన్నారు. ప్రజాఉద్యమానికి పిలుపునిచ్చిన తమను హౌస్ అరెస్టులు చేసి అడ్డుకుంటున్నారన్నారు. ఆలయాలపై దాడుల వెనుక బీజేపీ పాత్ర ఉందని చెప్పడం ప్రభుత్వం నీతి బాహ్యమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో మత విద్వేషాలను ప్రభుత్వమే రెచ్చగొడుతుందన్న వీర్రాజు.., చర్చి ఫాదర్లకు జీతాలిస్తూ మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలపై దాడులను అరికట్టేందుకు ఆన్ లైన్లో నామినషన్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరముందని సము వీర్రాజు అన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.