Janasena-BJP: మిత్రుల మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ... పవన్ కామెంట్స్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) బలపడాలంటే జనసేన (Janasena),బీజేపీ (BJP) కెమిస్ట్రీ సరిపోదన్న పవన్ కామంట్స్ నాయకులకు అర్థమైనట్టు కనిపిస్తోంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎధగాలనే ఉద్దేశంలో జనసేన, భారతీయ జనతా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పొత్తులపై చర్చించారు. అప్పుడప్పుడు పవన్-సోము వీర్రాజు భేటీ అవుతూ రాజకీయ వ్యూహాలపై చర్చిస్తున్నారు. అంతాబాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇటు జనసేన నేతలు గానీ, అటు బీజేపీ నేతలు గానీ కలిసి ముందుకు సాగుతున్న సందర్భాలు లేవనే చెప్పాలి. ఈ క్రమంలో ఇటీవల తిరుపతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఢిల్లీలో దగ్గరగా.., ఏపీలో దూరంగా ఉన్నామన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి.

  ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో బలపడాలంటే జనసేన,బీజేపీ కెమిస్ట్రీ సరిపోదన్న పవన్ కామంట్స్ నాయకులకు అర్థమైనట్టు కనిపిస్తోంది. ఇరుపార్టీల నాయకులు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తేనే.. ఒకవైపు అధికారపక్షాన్ని, రెండో వైపు టీడీపీని ఎదుర్కోలేమనేది అంతర్గత భేటీల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నిన్న (జనవరి 26) మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి ఏపీ బీజేపీ చీఫ్ సోమూవీర్రాజు రావడం ఆశక్తిని రేపింది. కార్యాలయానికి చేరుకున్న సోము వీర్రాజుకి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సాదరంగా స్వాగతం చెప్పి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని చూపించారు. తరువాత జనసేన నేతలు, ఆ పార్టీ వీర మహిళలను ఆయనకు పరిచయం చేసారు. ఇక ఈరోజు (జనవరి 27) నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని జనసేన నాయకులు విజయవాడలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ నేతలతో మాటామంతి సాగించారు.

  ఇది చదవండి: మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి..? జనసేన ముఖ్యనేత సంచలన వ్యాఖ్యలు


  ఏపీలో ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ,జనసేన పార్టీలు.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా? లేక జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా ? అనే అంశం తేలకపోయినప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా తమ బలాన్ని నిరూపించుకోవాలని ఇరు పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో బలం చాటితేనే.. ఆంధ్రప్రదేశ్‌లో తాము బలపడతామనే సంకేతాలు ప్రజలకు ఇవ్వొచ్చని బీజేపీ నమ్ముతోంది. అలా జరగని పక్షంలో ఏపీలో రాజకీయ శక్తిగా ఎదగాలన్న తమ కోరిక తీరడం మరింత కష్టమవుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. వారి ఆలోచనలు ఈ రకంగా ఉంటే.. పంచాయతీ ఎన్నికలు బీజేపీ జనసేన కూటమికి పెద్ద పరీక్షగా మారబోతున్నాయని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

  ఇది చదవండి: ప్రభుత్వ జీవోతో అలర్ట్ అయిన నిమ్మగడ్డ.., అధికారులకు స్పష్టమైన టార్గెట్... వాలంటీర్లకు షాక్


  పంచాయతీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై జనసేన-బీజేపీలకు ఇంకా స్పష్టత రాలేదు. కరెక్ట్ గా చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ చేసిన ఈ రెండు పార్టీలకు.., అకస్మాత్తుగా వచ్చినట్టు ఈ పంచాయతీ ఎన్నికలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయనే చెప్పొచ్చు.
  Published by:Purna Chandra
  First published: