క్రైస్తవ ప్రార్థనల్లో వైవీ సుబ్బారెడ్డి, భార్య... జనసేన సంచలన ఆరోపణలు

క్రైస్తవ ప్రార్థనల్లో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నట్టు జనసేన విడుదల చేసిన ఫొటో (Screen Grab)

వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత రెడ్డి బైబిల్ పట్టుకొని క్రీస్తు ప్రార్ధన ఎలా చేస్తారని ప్రశ్నించారు.

 • Share this:
  (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

  టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై జనసేన నాయకులు సంచలనమైన ఆరోపణలు చేశారు. కోట్లాది మంది హిందుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చైర్మన్ వైవీ ప్రవర్తించడం సబబు కాదని విమర్శించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత రెడ్డి బైబిల్ పట్టుకొని క్రీస్తు ప్రార్ధన ఎలా చేస్తారని ప్రశ్నించారు. బైబిల్ పట్టుకొని ప్రార్ధనలో టీటీడీ చైర్మన్ వైవీ, చైర్మన్ సతీమణి పాల్గొనటం హిందుత్వంపై వారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు హేయమైన చర్యగా అభివర్ణించారు. 25 రోజులు తిరుమలలో ఉంటూ..., స్వామి వారి ఆలయానికి వెళ్ళి వచ్చే స్వర్ణలత క్రైస్తవ ప్రార్ధనలు చేయడంతో వారు క్రైస్తవులేనని తేటతెల్లమైందని అన్నారు. హైందవేతరులకు టీటీడీ ఉన్నత పదవుల్లో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలను ఏం చేయాలని హైందవేతరులను టీటీడీ పాలకమండలి చైర్మన్ గా నియమించారో తెలపాలని ప్రశ్నించారు. 24గంటల్లో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ విధుల నుంచి తొలగించకపోతే.., ప్రత్యక్ష ఆందోళనకు దొగుతామని జనసేన నాయకులు హెచ్చరించారు.

  క్రైస్తవ ప్రార్థనల్లో వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని పాల్గొన్నట్టు జనసేన విడుదల చేసిన ఫొటో (Screen Grab)  వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ఇడుపుల పాయలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం నివాళి అర్పించింది. ఈ సందర్భంగా నిర్వహించిన క్రైస్తవ ప్రార్థనల్లో వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య పాల్గొన్నారని టీటీడీ ఆరోపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన హైందవ ఆలయ ట్రస్ట్ బోర్డు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అన్యమత ప్రార్థనల్లో పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. వైవీ నియామకం సందర్భంగా కూడా ఆయన హిందువు కాదనే ఆరోపణలు వచ్చాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: