ఓడినచోటు నుంచే పవన్ కల్యాణ్ పర్యటన... వచ్చేనెల ప్రారంభం

భీమవరంలో పర్యటించి పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన అభిమాని కుటుంబసభ్యుల్ని పరామర్శించనున్నారు.

news18-telugu
Updated: July 30, 2019, 8:58 AM IST
ఓడినచోటు నుంచే పవన్ కల్యాణ్ పర్యటన... వచ్చేనెల ప్రారంభం
పవన్ కల్యాణ్
  • Share this:
విజయవాడ పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పనవ్ కల్యాణ్ ఆధ్వర్యంలో తొలిసారిగా రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో నాగబాబు, నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అందరి సలహాలు సూచనలు సేకరిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతీ కార్యకర్త, ప్రతీ నేత వ్యక్తిగత అజెండాను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చినట్లు మనోహర్ వెల్లడించారు.

గత ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతీ కార్యకర్తను అభినందించారన్నారు. వచ్చేనెల మొదటివారంలో పవన్ భీమవరంలో పర్యటించి పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన అభిమాని కుటుంబసభ్యుల్ని పరామర్శిస్తారని తెలిపారు.ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి పర్యటనలు చేయలేదు. అయితే తాజాగా ఆయన పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గంలోనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా పార్టీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా కార్యకర్తలు, నేతలతో పవన్‌ ఈ సమావేశాల్లో చర్చలు జరుపుతున్నారు. సోమవారం నుంచి పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక ఇవాళ  ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం భేటీ కానుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం భేటీ జరగనుంది. ఈనెల 31న అంటే బుధవారం ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశం జరగనుంది.
First published: July 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading