Revanth Reddy: రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి రాకపోతే.. కాంగ్రెస్‌కు తగిలే మొదటి దెబ్బ అదేనా..

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఎంపిక అంశం కూడా ప్రభావం చూపించవచ్చని తెలుస్తోంది.

  • Share this:
    రాజకీయాల్లో చాలా అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం మారుతున్న తెలంగాణ రాజకీయాలు.. భవిష్యత్తులో మరింతగా మారతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ రూపంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలహీనపడుతున్నా... నేతలు మాత్రం కీలకమైన టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీపడుతున్నారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఈ పదవి కోసం పోటీ పడే వారి జాబితాలో ముందున్నారు.

    ఇక టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఆయన అనుకూల వర్గం... ఆయన తప్ప తమలో ఎవరికి ఇచ్చినా ఓకే అని మరో వర్గం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర లాబీయింగ్ మొదలుపెట్టాయి. దీంతో తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇతర పార్టీల్లో చేరి రాష్ట్రస్థాయిలో మరొకరి నాయకత్వంలో పని చేయడం కంటే... సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడం మంచిదనే భావనలో రేవంత్ రెడ్డి వర్గం ఉన్నట్టు తెలుస్తోంది.

    Revanth reddy news, komatireddy venkat reddy news, tpcc news, congress news, telangana congress, komatireddy venkat reddy news, రేవంత్ రెడ్డి న్యూస్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ న్యూస్, కాంగ్రెస్ న్యూస్, తెలంగాణ కాంగ్రెస్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూస్
    రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(పైల్ ఫోటో)


    ఇదిలా ఉంటే ఒకవేళ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే కాంగ్రెస్‌కు తగలబోయే మొదటి షాక్.. నాగార్జునసాగర్ రూపంలోనే ఉండబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. జానారెడ్డి కుటుంబానికి, రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో తెలిపారు.

    ఇక రేవంత్ రెడ్డికి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి కూడా స్నేహం ఉంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కితే.. ఆయనతో కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి కాకుండా మరొకరికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే... ముందుగా రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    Janareddy son raghuveer reddy, telangana news, telangana politics, nagarjuna sagar by election, raghuveer reddy news, జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, తెలంగాణ న్యూస్, తెలంగాణ రాజకీయాలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, రఘువీర్ రెడ్డి న్యూస్
    రఘువీర్ రెడ్డి (ఫైల్ ఫోటో)


    మరోవైపు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న రఘువీర్ రెడ్డికి బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్ నుంచి కూడా ఆహ్వానం ఉందని.. స్వయంగా సీఎం కేసీఆర్ నుంచే ఆయనకు ఈ మేరకు సంకేతాలు వచ్చాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఎంపిక అంశం కూడా ప్రభావం చూపించవచ్చని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: