రాజకీయాలపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. వాటిపై ఆసక్తి లేదంటూ..

పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఇక సినిమాలు చేసే ప్రసక్తే లేదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రకటించారు.

Bommakanti Shravan | news18-telugu
Updated: May 30, 2019, 7:02 AM IST
రాజకీయాలపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. వాటిపై ఆసక్తి లేదంటూ..
పవన్ కళ్యాణ్ (ఫైల్ చిత్రం)
  • Share this:
ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకలో ఓడిపోయారు. దీంతో ఎన్నికల అనంతరం మళ్లీ సినిమాల్లోకి వస్తారని అంతా భావించారు. కానీ, పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఇక సినిమాలు చేసే ప్రసక్తే లేదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రకటించారు. ఇది వరకే ఈ విషయాన్ని స్పష్టం చేసినా.. ఎన్నికల అనంతరం అదే మాటను కుండబద్దలు కొట్టడంతో పవన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, పవన్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాతగా సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిని ఖండించిన పవన్.. రాబోయే 25 ఏళ్లు ప్రజల కోసమే పనిచేస్తానని, సినిమాల్లోకి తిరిగి వచ్చే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు.

ఏపీలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ 23, జనసేన ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన విషయం తెలిసిందే.First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు