అసెంబ్లీలో పవన్ కల్యాణ్‌పై.. జనసేన ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభుత్వం ప్రజల కోసం చేసే మంచి పనులను చేస్తే సమర్థిస్తామన్నారు రాపాక. ఏపీ ప్రభుత్వం అటు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చూసుకుంటూ అన్నివర్గాలకు సమదృష్టితో చూస్తూ ఈ బడ్జెట్ ను రూపొందించిందన్నారు.

news18-telugu
Updated: July 17, 2019, 2:47 PM IST
అసెంబ్లీలో పవన్ కల్యాణ్‌పై.. జనసేన ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్
  • Share this:
అసెంబ్లీ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. ఆపార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రాపాక మాట్లాడుతూ..‘అధ్యక్షా.. నేను జనసేన తరఫున మాట్లాడుతున్నా అధ్యక్షా. అధికార పక్షం ఏదైనా మాట్లాడితే వెంటనే వ్యతిరేకించు అని మా అధినేత పవన్ కల్యాణ్ చెప్పలేదు అధ్యక్షా’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సంబంధించిన ఏమైన కార్యక్రమాలు జరుగుతుంటే  మద్దతు ఇవ్వాలని పవన్ చెప్పారన్నారు. అంతేకాని అధికార పక్షం ఏం చేసిన వ్యతిరేకించమని పవన్ చెప్పలేదన్నారు.

ప్రభుత్వం ప్రజల కోసం చేసే మంచి పనులను చేస్తే సమర్థిస్తామన్నారు రాపాక. ఏపీ ప్రభుత్వం అటు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చూసుకుంటూ అన్నివర్గాలకు సమదృష్టితో చూస్తూ ఈ బడ్జెట్ ను రూపొందించిందన్నారు. వైసీపీ పార్టీ తమ మేనిఫెస్టోను దైవ గ్రంథంతో పోల్చిందన్నారు. ఇందులో నిజంగా అన్నీ ప్రజా సంక్షేమ పథకాలే ఉన్నాయన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక. ఏపీ ఆర్థిక బడ్జెట్ 2019-20ను చాలా పారదర్శకంగా రూపొందించారని వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రశంసించారు రాపాక. తండ్రి వైఎస్ తరహాలో ఆయన కుమారుడు, సీఎం జగన్ కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్ రూపొందించాని కొనియాడారు.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...