హోమ్ /వార్తలు /National రాజకీయం /

MLA Rapaka: రాజోలు వైసీపీ ఇన్ఛార్జ్ గా జనసేన ఎమ్మెల్యే.? ప్రత్యర్థి వర్గం రియాక్షన్..? జనసేన కార్యకర్తల మాటేంటి..?

MLA Rapaka: రాజోలు వైసీపీ ఇన్ఛార్జ్ గా జనసేన ఎమ్మెల్యే.? ప్రత్యర్థి వర్గం రియాక్షన్..? జనసేన కార్యకర్తల మాటేంటి..?

రాజోలు వైసీపీ ఇన్ చార్జ్ గా రాపాక

రాజోలు వైసీపీ ఇన్ చార్జ్ గా రాపాక

Rapaka Vara Prasada Rao: ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో.. జనసేన పోటీ చేసింది. అధినేత పవన్ కూడా రెండు చోట్ల పోటీ చేసి.. ఓడిపోయారు.. కానీ ఒక్క తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజక వర్గంలోని రాపాక గెలుపొందారు.. కానీ ఇప్పుడు వైసీపీ ఇన్చార్జ్ అయ్యారు.

ఇంకా చదవండి ...

YCP Rapaka Vara Prasada Rao: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయ పార్టీ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో జనసేన పార్టీ (Janasena Party) పోటీ చేసింది. అయితే ఒక్క తూర్పుగోదావరి జిల్లా (East Godavari District)  రాజోలు నియోజక వర్గంలోని జనసేన సేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ (Rapaka vara Prasad)మినహా అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. రాజోలు నుంచి రాపాక వర ప్రసాద్ తప్ప.. పవన్ తో సహా అందరూ ఓటమి పాలయ్యారు. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాపాక అధికార పార్టీలో జాయిన్ అవుతారనే వార్తలు వినిపించినా.. అప్పట్లో ఆయన అవి అన్నీ పుకార్లంటూ కొట్టిపడేశారు. అధికార పార్టీలోకి వెళ్తే.. తాను 152.. అదే జనసేనలో ఉంటె..తానే రాజు.. తానే మంత్రి అన్నచందంగా మాట్లాడారు.. కానీ కాలక్రమంలో రాపాక జనసేనకు దూరంగా అధికార పార్టీ వైసీపీ (YCP)కి దగ్గరగా జరగడం మొదలు పెట్టారు. అంతేకాదు.. అసెంబ్లీలో అధికార పార్టీ వైసీపీ వైపు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలకు జై కొట్టడం మొదలు పెట్టారు. అయితే రాపాక వరప్రసాద్ రావు మాత్రం తాను అధికారికంగా జనసేనను వీడి.. వైసీపీలో చేరుతున్నానని చెప్పలేదు. ఇటు జనసేన కూడా అసలు మకు ఒక ఎమ్మెల్యే గత ఎన్నికల్లో గెలిచాడు అన్నట్లు భావించడం లేదు.. అయితే ఇటీవల వైసీపీ నేతలు చేపట్టిన దీక్షల్లో పాల్గొన్న రాపాక.. వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఈ విషయంపై వివాదం చెలరేగింది. పార్టీ ఫిరాయింపులను తాము ఒప్పుకోము అని మొదటి నుంచి చెబుతున్న వైసీపీ సర్కార్ ఈ విషయంపై ఏ సమాధానం చెబుతుంది అంటూ కామెంట్స్ వినిపించాయి. దీనికి తోడు తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక రాజోలు నియోజక వర్గం వైసీపీ ఇంచార్జ్ అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇటీవల వైజాగ్ పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. స్టీల్ ప్లాంట్ ఉద్యమ కారులకు సంఘీభావం ప్రకటించి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో మాట్లాడిన ఆయన.. తమకు ఉన్న ఏకైక ఎమ్మెల్యేను వైసీపీ లాగేసుకుందని మండిపడ్డారు.. వైసీపీని పవన్ విమర్శించిన కొద్ది రోజుల్లోనే ఇప్పుడు రాపాక వైసీపీ ఇన్చార్జ్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది..

ఇదీ చదవండి: జగన్ మెజార్టీని రికార్డు బ్రేక్ చేసిన డాక్టర్ సుధ.. ఆమె గెలుపుపై సీఎం ఏమన్నారంటే..?

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజక వర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జి గా జనసేన ఎమ్మెల్యేను రాపాకవరప్రసాదరావు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు విజయవాడ ఎయిర్పోర్ట్ లో సంబరాలు జరుపుకున్నారు. ఈ వైసీపీ కార్యకర్తల ఆనందోత్సాహాల్లో అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా పాల్గొనడం విశేషం.

ఇదీ చదవండి: ఎనీ సెంటర్, ఎనీ ఎలక్షన్, సీఎం సింగిల్ హ్యాండ్.. రోజా జబర్దస్త్ డైలాగ్స్

ఈ సందర్భంగా ఎంపీ చింతా అనురాధ .. రాజోలు నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలకు నేతలకు కొన్ని సూచనలు చేశారు. ఇక నుంచి రాజోలు నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు రాపాక తోనే పయనించాలని సూచించారు. నేరుగా ఎంపీ సూచించినా.. స్థానిక వైసీపీ నేతలు మాత్రం ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.. త్వరలోనే దీనిపై అధిష్టానం దగ్గర తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడడం బెటరని భావిస్తున్నారు..

ఇదీ చదవండి: బద్వేల్ లో రికార్డు విజయం.. సీఎం జగన్ కు సైతం షాక్.. రౌండ్ రౌండ్ కు ఇలా..?

ఇటు జనసేన అభిమానులు, కార్యకర్తలు సైతం రాపాక తీరుపై మండిపడుతున్నారు.. వచ్చే ఎన్నికలో తమ సత్తా చూపిస్తామని.. జనసేన తరపున గెలిచి.. వైసీపీలో చేరిన ఆయనకు సరైన బుద్ధి చెబుతామని మండిపడుతున్నారు.. స్థానిక ఎన్నికల్లోనూ జనసేన సత్తా ఏంటో బయటపడిందని.. 2024 ఎన్నికల్లో ఆయన సంగతి చూస్తామంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Rapaka varaprasad, Ycp

ఉత్తమ కథలు