హోమ్ /వార్తలు /National రాజకీయం /

Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి షాకింగ్ నిర్ణయం.. సాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత అనుహ్యంగా..

Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి షాకింగ్ నిర్ణయం.. సాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత అనుహ్యంగా..

Nagarjuna Sagar By Election Result: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక వ్యాఖ్యాలు చేశారు.

    నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఫలితాలు వెలువడిన అనంతరం జానారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన గౌరవం కోసం నాగార్జునసాగర్‌లో పోటీ చేసినట్లు జానారెడ్డి తెలిపారు. ధర్మం, ప్రజాస్వామ్య విలువతో ఎన్నికల్లో పాల్గొనట్టు తెలిపారు. తాను ఎన్నికల్లో కొత్త ఒరవడి తీసుకోద్దామని చేసిన విజ్ఞప్తిని పార్టీలు పట్టించుకోలేదని చెప్పారు. భవిష్యత్‌లో తనకు మళ్ళీ పోటీ చేయాలని లేదని అన్నారు. వయసు దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోవట్లేదని జానారెడ్డి అన్నారు. తన వారసుడిని బరిలో నిలిపలా లేదా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

    ఈ ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా 10 శాతం మాత్రమేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు అంతా కలిసి ఎన్నికలపైన దృష్టి సారించిన స్వల్ప తేడాతోనే విజయం సాధించిందని అన్నారు. పార్టీకి అండగా ఉండాలని, కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలని తాను ఎన్నికల్లో పోటీ చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణఉలు ఇదే ప్రోత్సహంతో ముందుకు సాగాలని కోరారు.

    ఇక, సాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భరత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సాగర్ ఉప ఎన్నికల ఓట్లు లెక్కింపులో భాగంగా టీఆర్ఎస్ తొలి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ తన సమీప ప్రత్యర్థి జానారెడ్డిపై 18,449 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 87,254 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 68,805 ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చారు.

    First published:

    ఉత్తమ కథలు