news18-telugu
Updated: August 6, 2019, 9:40 AM IST
ప్రధాని నరేంద్ర మోదీ
ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాక జమ్ముకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విడిగొట్టింది. దశాద్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉంటున్న జమ్ముకాశ్మీర్ రూపు రేఖలు ఇక నుంచి మారనున్నాయి. దీని కోసం కేంద్రం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రగతి దిశగా జమ్ముకాశ్మీర్‌ను తీసుకెళ్లేందుకు కేంద్రం అడుగులు వేగవంతం చేస్తోంది. అక్టోబర్‌లో కాశ్మీర్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సదస్సు ద్వారా కాశ్మీర్‌లోకి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్ముకాశ్మీర్ తన ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. దీంతో ఇక నుంచి అక్కడ పెట్టుబడులు పెట్టుకునే అవకాశం, భూములు కొనుక్కొనే హక్కు అందరికీ లభించినట్లే. ఆర్టికల్ 370 కింద ఇంతకాలం అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. రక్షణ, విదేశీ వ్యవహారాలు , సమాచార వ్యవస్థ మినహా మిగిలిన భారతదేశానికి విభిన్నంగా ఉండేవి. జమ్ముకాశ్మీర్‌లో ఆస్తుల్ని కొనే హక్కు ఇతర రాష్ట్రాల వారికి ఉండేది కాదు. దీంతో ఆర్టికల్ 370ని ఇప్పుడు కేంద్రం రద్దు చేయడంతో ప్రత్యేక ప్రతిపత్తిని జమ్ముకాశ్మీర్ కోల్పోయింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడు వెళ్లి సెటిల్ అవ్వొచ్చు. పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమలను స్థాపించడం వంటివి చేయోచ్చు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండియన్ పీనల్ కోడ్ ఇకపై జమ్ముకాశ్మీర్‌లో కూడా అమలవుతుంది. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ ప్రభుత్వోద్యోగాలను పొందవచ్చు. జమ్ముకాశ్మీర్ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా అక్కడ సమాన హక్కులు లభిస్తాయి.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్ముకాశ్మీర్ , లడఖ్ పేరిట కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాడ్డాయి. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై అంతర్జాతీయ మీడియా తీవ్రంగానే స్పందించింది. కాశ్మీర్ రెండు ప్రాంతాలుగా చేయడం నాటకీయ చర్చ అని కొన్ని సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. పాకిస్థాన్‌లో ఈ చర్య ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చని పేర్కొన్నాయి. జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదన్నాయి.
Published by:
Sulthana Begum Shaik
First published:
August 6, 2019, 9:40 AM IST