2021లో జమ్మూ కశ్మీర్ ఎన్నికలు.. ఆలస్యానికి కారణం అదే..

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మ్యాప్

Jammu Kashmir Elections: అసెంబ్లీ సీట్ల పునర్విభజన ప్రక్రియ ఈ ఏడాది నవంబర్ చివరలో ప్రారంభమై, ఆ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 14 నెలలు పడుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.

  • Share this:
    జమ్మూ కశ్మీర్‌‌లో ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవా? ఇంకా రెండేళ్లు పట్టే అవకాశం ఉందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది చివర్లో జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు ఉంటాయని అంతా భావించారు. అక్కడి వాతావరణం ప్రశాంతంగా మారిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం కూడా స్పష్టం చేసింది అయితే, ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు 2021 వరకూ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు వల్లే ఈ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సీట్ల పునర్విభజన ప్రక్రియ ఈ ఏడాది నవంబర్ చివరలో ప్రారంభమై, ఆ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 14 నెలలు పడుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏంటంటే... జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా ఈ ఏడాది అక్టోబర్ 31 తర్వాత ఈసీఐకి హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసే అవకాశాలున్నాయి.

    అంతకంటే ముందు డీలిమిటేషన్‌పై ఈసీఐకి లేఖ రాసే అవకాశాలు లేవు. దానికి జమ్మూ కశ్మీర్, లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారేది ఆ రోజు నుంచే. దీంతో ఆ తర్వాత ఈసీఐకి సమాచారం అందుతుంది. హోం శాఖ నుంచి సమాచారం అందగానే నియోజకవర్గాల పునర్వవస్థీకరణ ప్రక్రియ మొదలవుతుంది. దీన్ని బట్టి జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు 2021 వరకూ వేచిచూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు.
    First published: