జమ్మూ కాశ్మీర్ విభజనకు లోక్‌సభ ఆమోదం

జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభలో బీజేపీ,శివసేన,టీఆర్ఎస్,టీడీపీ,ఆప్,బీఎస్పీ,అన్నాడీఎంకే సహా పలు ఇతర పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. బిల్లును కాంగ్రెస్,ఎస్పీ,తృణమూల్,డీఎంకే,ఎన్సీపీ,ఎన్సీ,పీడీపీ బిల్లును వ్యతిరేకించాయి. జేడీయూ సహా పలు ఇతర పార్టీలు వాకౌట్ చేశాయి.

news18-telugu
Updated: August 6, 2019, 7:49 PM IST
జమ్మూ కాశ్మీర్ విభజనకు లోక్‌సభ ఆమోదం
లోక్‌సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకు వచ్చిన ఓట్ల వివరాలు
  • Share this:
జమ్మూ కాశ్మీర్ విభజనకు లోక్ సభ ఆమోదం తెలిపింది. సోమవారం రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న కేంద్రం... మంగళవారం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లుపై లోక్‌సభలోని అనేక పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. బీజేపీ,శివసేన,టీఆర్ఎస్,టీడీపీ,ఆప్,బీఎస్పీ,అన్నాడీఎంకే సహా పలు ఇతర పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ఇక కాంగ్రెస్,ఎస్పీ,తృణమూల్,డీఎంకే,ఎన్సీపీ,ఎన్సీ,పీడీపీ బిల్లును వ్యతిరేకించాయి. జేడీయూ సహా పలు ఇతర పార్టీలు వాకౌట్ చేశాయి. బిల్లుకు అనుకూలంగా 351 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. ఒక సభ్యుడు తటస్థంగా నిలిచారు.

బిల్లుపై చర్చ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 కారణంగానే కాశ్మీర్‌ను ప్రత్యేకంగా చూశారని అన్నారు.ప్రధాని నరేంద్రమోదీ కారణంగానే 70 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు. కాశ్మీర్‌కు కేంద్రపాలిత హోదా తాత్కాలికమే అని... పరిస్థితులు చక్కబడితే పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న పీవోకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసని అమిత్ షా అన్నారు. నాటి ప్రధాని నెహ్రూ నిర్ణయాల కారణంగానే పీవోకే మనకు చెందకుండా పోయిందని అన్నారు.

ఆర్టికల్ 370ను ఇప్పటివరకు చాలామంది ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారని అమిత్ షా విమర్శించారు. లోక్‌సభలో బిల్లు ఆమోదానికి కొద్దిసేపు ముందు సభలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి జాతీయ గతం పాడుతూ బీజేపీ ఎంపీలు స్వాగతం పలికారు. జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడమే తరువాయిగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: August 6, 2019, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading