ఈద్ కోసం పాకిస్థాన్ అణుబాంబులు దాచుకోలేదు... మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని వ్యాఖ్యలపై మెహబూబాబ ముఫ్తీ కౌంటర్ ఇస్తూ... పాకిస్థాన్ సైతం ఈద్ కోసం న్యూక్లియర్ బాంబులను దాచుకోలేదని మెహబూబా అన్నారు. దీంతో మెహబుబా ముఫ్తీ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

news18-telugu
Updated: April 22, 2019, 4:56 PM IST
ఈద్ కోసం పాకిస్థాన్ అణుబాంబులు దాచుకోలేదు... మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
మెహబూబా ముఫ్తీ (File)
news18-telugu
Updated: April 22, 2019, 4:56 PM IST
ప్రధాని మోదీ అణుబాంబు వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీ స్పందించారు. దీపావళి కోసం న్యూక్లియర్ బాంబులను దాచుకోలేదు అని ప్రధాని వ్యాఖ్యలపై మెహబూబాబ ముఫ్తీ కౌంటర్ ఇస్తూ... పాకిస్థాన్ సైతం ఈద్ కోసం న్యూక్లియర్ బాంబులను దాచుకోలేదని మెహబూబా అన్నారు. దీంతో మెహబుబా ముఫ్తీ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా మోదీ వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోయినప్పటికీ, మెహబుబా ముఫ్తీ ఈ విధంగా పాక్ తరపున వకాల్తా పుచ్చుకొని వ్యాఖ్యానించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానిమోదీ పాకిస్థాన్ తరచూ అణుబాంబులు వేస్తామని బెదిరిస్తోందని, అయితే అణ్వస్త్రాలను ప్రయోగించాల్సి వస్తే, చూస్తూ ఊరుకోమని భారత్ కూడా అణ్వస్త్ర పాటవం కలిగిన దేశమేనని, దీపావళి కోసం అణ్వస్త్రాలను దాచుకోలేదని మోదీ వ్యాఖ్యానించారు.

First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...