Jaipal Reddy | జైపాల్ రెడ్డి పాడెమోసిన కర్ణాటక మాజీ సీఎం, మాజీ స్పీకర్

Jaipal Reddy | జైపాల్ రెడ్డి పాడెను సిద్ధరామయ్య, కేఆర్ రమేష్ కుమార్ మోశారు.

news18-telugu
Updated: July 29, 2019, 4:05 PM IST
Jaipal Reddy | జైపాల్ రెడ్డి పాడెమోసిన కర్ణాటక మాజీ సీఎం, మాజీ స్పీకర్
జైపాల్ రెడ్డి పాడె మోస్తున్న సిద్ధరామయ్య, రమేష్ కుమార్
news18-telugu
Updated: July 29, 2019, 4:05 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులో పీవీ ఘాట్ పక్కన ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అధికార లాంఛనాలతో సూదిని జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు దేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. ముఖ్యంగా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కూడా అందులో ఉన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన జైపాల్ రెడ్డితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియలకు ముందు జైపాల్ రెడ్డి పాడె మోశాడు. ఓ వైపు సిద్ధరామయ్య, మరోవైపు రమేష్ కుమార్ ఇద్దరూ పాడె మోశారు.

కర్ణాటకలో ఇవాళ యడియూరప్ప బలపరీక్ష జరిగింది. యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకుంది. అది జరిగిన వెంటనే స్పీకర్ రమేష్ కుమార్ తన రాజీనామాను ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా తన రాజీనామాను ప్రకటించి సంచలనం సృష్టించారు. సభ ముగిసిన వెంటనే సిద్ధరామయ్యతో కలసి రమేష్ కుమార్ నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో స్పీకర్ రమేష్ కుమార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దీంతోపాటు 17 మంది రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, వారిని 2023 వరకు మళ్లీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసి ఆయన మరో సంచలనాన్ని సృష్టించారు.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...