Bihar Elections: ఆయనకు జైలే సరి.. నితీష్ పై విరుచుకుపడ్డ చిరాగ్ పాశ్వాన్

Bihar Elections: బీహార్ ఎన్నికలకు రెండు రోజుల ముందు లోక్ జనశక్తి పార్టీ నేత చీరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కు జైలే సరైన స్థలమని భావిస్తున్నానంటూ తీవ్ర వాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 26, 2020, 3:51 PM IST
Bihar Elections: ఆయనకు జైలే సరి.. నితీష్ పై విరుచుకుపడ్డ చిరాగ్ పాశ్వాన్
చిరాగ్ పాశ్వాన్ (Image; ANI)
  • Share this:
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ బీహార్ లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. బీహార్ ఎన్నికలకు రెండు రోజుల ముందు లోక్ జనశక్తి పార్టీ నేత చీరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కు జైలే సరైన స్థలమని భావిస్తున్నానంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ పాలనలో ఈ ఐదేళ్లలో అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని గతంలో ఆయన వాఖ్యానించడం తెలిసిందే. ఈ అంశంపై పాశ్వాన్ మరోసారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి తెలియకుండా అధికారులు, ఇతరులు అవినీతికి పాల్పడే అవకాశం ఉండదన్నారు. ఈ విషయాన్ని తాను, ప్రజలు నమ్ముతున్నామన్నారు. అవినీతికి పాల్పడే వారెవరైనా జైలుకు వెళ్లాల్సిందేననన్నారు. అవినీతి చేసే నాయకులెవరైనా స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించరాన్నారు.  రాష్ట్రంలో చేపట్టిన మద్యాపన నిషేధంపై సైతం పాశ్వాన్ విమర్శలు గుప్పించారు. అవినీతికి కేంద్రంగా ఆ ప్రాజెక్టు మారిందని ధ్వజమెత్తారు. బీహార్‌లో మద్యం అక్రమ రవాణాదారులు లేరా? బీహార్‌లోకి మద్యం అక్రమ రవాణా చేయలేదా? అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఈ విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసంటూ దుయ్యబట్టారు.

నితీష్ ఫ్రీ బీహార్ అంటూ #nitishmuktBihar అన్న ట్యాగ్ తో ట్విట్టర్ లో పాశ్వాన్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ నెల 28న బీహార్ లో మొదటి మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3,7 తేదీల్లో మరో రెండు దశల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్టోబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి నుంచి లోక్ జనశక్తి పార్టీ బయటకు వచ్చింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు బీజేపీ-జేడీయూ ఒక కూటమిగా, కాంగ్రెస్, ఆర్ఎల్డీ, లెఫ్ట్ మరో కూటమిగా పోటీ పడుతున్నాయి.

బీహార్‌లో అధికార బీజేపీ - జేడీయూ కూటమి మీద లాలూ కుమారుడు, ఆర్జేడీకి నాయకత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్ విరుచుకుపడ్డారు. ఒకవేళ తాము కూడా బీజేపీ, డబుల్ ఇంజిన్ గవర్న‌మెంట్ (బీహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తోందని ప్రధాని మోదీ బీహార్ ఎన్నికల ర్యాలీలో అన్న మాట) తరహాలో తప్పుడు హామీలు ఇవ్వాలనుకుంటే 50 లక్షలు లేకపోతే కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించేవారిమని తేజస్వి యాదవ్ అన్నారు. ‘ఉపాధి చూపించడానికి, ఉద్యోగం చూపించడానికి మధ్య చాలా తేడా ఉంది. చెత్త కాగితాలు ఏరుకునే వాడికి కూడా ఉపాధి ఉన్నట్టే. కానీ, మేం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే దీనిపై సంతకం పెడతాం. హెల్త్ కేర్ సెక్టార్‌లో, ఎడ్యుకేషన్ సెక్టార్, మొదలైన వాటిలో 4.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 7 శాతం జూనియర్ ఇంజినీర్ల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.’ అని తేజస్వి యాదవ్ అన్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 26, 2020, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading