సొంత పార్టీ నేతలపై జగ్గారెడ్డి ఆగ్రహం.. చర్యలు తీసుకోవాల్సిందే

దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు జగ్గారెడ్డి. అలాంటి కుటుంబంపై విమర్శలు చేయడం తగదని సీనియర్లపై మండిపడ్డారు.

news18-telugu
Updated: August 24, 2020, 3:16 PM IST
సొంత పార్టీ నేతలపై జగ్గారెడ్డి ఆగ్రహం.. చర్యలు తీసుకోవాల్సిందే
జగ్గారెడ్డి (File- credit - twitter)
  • Share this:
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభంపై తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బలమని అన్నారు. గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరు అధ్యక్షులుగా ఉన్న పార్టీకి నష్టం జరుగుతుందన్నారు జగ్గారెడ్డి. ఈ సందర్భంగా గాంధీ కుటుంబంపై ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి ప్రధానిగా నెహ్రు మన దేశానికి ఎన్నో పారిశ్రామిక,ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చారని.. వ్యవసాయ అభివృద్ధి కోసం భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు జగ్గారెడ్డి. అలాంటి కుటుంబంపై విమర్శలు చేయడం తగదని సీనియర్లపై మండిపడ్డారు.


కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి, సీనియర్లు గా ఉండి గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని లేఖ రాయడం ఏంటి? ఈ 23 మంది ప్రజనాయకులు కాకపోయినా పార్టీ పదవులు ఇచ్చింది. పార్టీనీ చీల్చే ప్రయత్నం చేస్తున్న సీనియర్ పై చర్యలు తీసుకోవాల్సిందే. రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీ భిక్షతో రాజకీయంగా ఎదిగిన నేతలే విమర్శించడమా? సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయిన పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. 73 ఏళ్ల వయసులో కుడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతూ దేశకోసం కష్టపడుతున్నారు.
జగ్గారెడ్డి


సీడబ్ల్యూసీ సమావేశం వేదికా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొత్త అధ్యక్షడుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించాలని పార్టీ నేతలకు ఆమె విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మీ రాహుల్ గాంధీని కోరారు. మరికొందరు నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగితే బాగుంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ఇక పార్టీలో నాయకత్వ మార్పునకు సంబంధించి ఇటీవల 23 మంది నేతలు సోనియా గాంధీకు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా ఆస్పత్రిలో ఉన్న సమయంలో లేఖ ఎలా రాస్తారని.. బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు CWC సమావేశంలో తీవ్ర దుమారంరేపాయి. ఆ లేఖతో తన తల్లి ఎందో బాధపడిందని ఆయన అన్నారు. ఐతే రాహుల్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఆ తర్వాత తన ట్వీట్‌ను వెనక్కి తీసుకున్నారు కపిల్ సిబల్.
Published by: Shiva Kumar Addula
First published: August 24, 2020, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading