చంద్రబాబు కారణం కాదు..కాంగ్రెస్ ఓటమికి వేరే కారణాలు: జగ్గారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్న వాదనను ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి వేరే కారణాలున్నాయని, వాటిని విశ్లేషించుకోవాలని పేర్కొన్నారు.

news18india
Updated: January 7, 2019, 11:42 PM IST
చంద్రబాబు కారణం కాదు..కాంగ్రెస్ ఓటమికి వేరే కారణాలు: జగ్గారెడ్డి
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు వల్ల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్న వాదనను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తోసిపుచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును జాతీయ నాయకుడిగా మాత్రమే చూడాలని జగ్గారెడ్డి...అయన పార్టీ ఎక్కడ ఉన్నా పోటీ చేసుకొనే అవకాశం ఉందన్నారు. అసలు పొత్తు నిర్ణయం రాహుల్ గాంధీదేనని.. పొత్తు నిర్ణయాన్ని పార్టీలో ఎవరైనా గౌరవించాల్సిందేనని అన్నారు.  కాంగ్రెస్ ఓటమికి వేరే కారణాలు ఉన్నాయని..వాటికి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి అన్నారు.

తెలంగాణలో చంద్రబాబుతో కాంగ్రెస్ కలవడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

First published: January 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు