నేడు అమరావతికి జగన్... బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చ

AP Assembly Election Results 2019 : ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో... దూకుడుమీదున్న జగన్... ఇవాళ లెక్క తేల్చేసేందుకు సిద్ధమయ్యారు. అమరావతికి వెళ్లి కేంద్రంలో ఎవరికి సపోర్ట్ ఇవ్వాలో ఆలోచించబోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 6:51 AM IST
నేడు అమరావతికి జగన్... బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చ
వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ పనైపోయిందని ఎన్నికల తర్వాతి రోజే (ఏప్రిల్ 12) ప్రకటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... జగన్ అనే నేను... అనేందుకు రెడీ అవుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆయనతోపాటూ ఆయన పార్టీలోని ప్రతి ఒక్కరికీ ఫుల్లు బూస్ట్ ఇచ్చాయి. ఆ జోష్‌లో ఉన్న జగన్... ఇవాళ అమరావతి దగ్గర్లో నిర్మించిన ఇల్లు, పార్టీ ఆఫీస్‌కి వెళ్లి... ఏంటి సంగతి అనబోతున్నారు. ఎన్నికల ఫలితాల్ని అక్కడి నుంచే సమీక్షిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. అప్పటికే 175 స్థానాల్లోని వైసీపీ అభ్యర్థులంతా అలర్ట్‌గా ఉండాలని పార్టీ ఇప్పటికే మూడుసార్లు ఆదేశించింది. సమస్యేంటంటే... ఎగ్జిట్ పోల్స్ వచ్చాక... తాము ఓడిపోతున్నామన్న ఆలోచనతో... టీడీపీ వర్గాలు ఎక్కడ లేనిపోని కల్లోలాలు సృష్టిస్తాయోనని జగన్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ ఎంత రెచ్చగొడుతున్నా, కంట్రోల్‌లో ఉండమనీ, గొడవలకు దిగొద్దనీ పోలింగ్ ఏజెంట్లూ, కార్యకర్తల్ని జగన్ కోరుతున్నారట.

టీడీపీ మరో మెలిక... వైసీపీకి తలనొప్పి : టీడీపీ అధినేత చంద్రబాబును ఓ తలనొప్పి నేతలా భావిస్తున్నారట వైసీపీ నేతలు. ఏమాత్రం కుదురులేకుండా చంద్రబాబు... అదీ ఇదీ అంటూ అడ్డమైన డిమాండ్లు చేస్తూ... ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో... లేనిపోని హడావుడి చేస్తున్నారని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటిదాకా 50 శాతం వీవీప్యాట్ల యంత్రాల్లోని స్లిప్పులను కౌంట్ చెయ్యాలన్న చంద్రబాబు... అది నెరవేరట్లేదన్న ఉద్దేశంతో... ముందుగా వీవీప్యాట్ స్లిప్పులు మాత్రమే కౌంటింగ్ చెయ్యాలనే పనికిమాలిన కండీషన్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఏదో ఒకటి చేసి... ఓటమికి కారణం ఈవీఎంలే అని చెప్పుకునేందుకు చంద్రబాబు ఈ కుట్రలు పన్నుతున్నారని విశ్వేశ్వరరెడ్డి లాంటి వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

కేంద్రంలో ఎవరికి మద్దతు : ఎగ్జిట్ పోల్స్ ప్రకారం NDA ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నా... తాము మద్దతు ఇవ్వాల్సి వస్తే బీజేపీకి ఇవ్వాలా, కాంగ్రెస్‌కి ఇవ్వాలా అన్న అంశంపై జగన్ చర్చించబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రభుత్వానికి మద్దతిస్తామన్నారు కాబట్టి... ఇదే డిమాండ్ వైసీపీ వినిపించే అవకాశం ఉంది. దీనిపై పార్టీలోని సభ్యుల సలహాలు, సూచనల్ని జగన్ స్వీకరించబోతున్నారు. అందుకే తమ పార్టీ నేతలంంతా హైదరాబాద్ నుంచీ అమరావతి రావాలని జగన్ ఆదేశించారు.

నేడు కుప్పంకి చంద్రబాబు : టీడీపీ అధినేత చంద్రబాబు... ఇవాళ కుప్పం వెళ్తున్నారు. అక్కడ జరిగే గంగమ్మ జాతరలో పాల్గొంటున్నారు. అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుంటారు. ఉదయం 9 గంటలకు బెంగళూరు నుంచీ కుప్పం వెళ్తారు. అమ్మవారిని దర్శించుకున్నాక, తిరిగి విజయవాడకు వెళ్తారు చంద్రబాబు.

 

ఇవి కూడా చదవండి :

ఏపీలో సంకీర్ణమే... గ్రహాలు అలా ఉన్నాయి... పవన్ మద్దతు అవసరమే...ఇస్రో మరో విజయం... నింగిలోకి రీశాట్-2బీ... సరిహద్దులపై రాడార్ నిఘా...

Photos : అమాయక చూపులతో కట్టిపడేస్తున్న ముంబై బ్యూటీ...

జబర్దస్త్ రష్మి లాగా కనిపించే కేరళ బ్యూటీ ఫొటోస్...
First published: May 22, 2019, 6:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading