ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్లు వేశారు. విద్యుత్ బిల్లుల పేరిట ఏపీలో కొత్త దోపిడీ ప్రారంభమైందని మండిపడ్డారు. ‘బాదుడే... బాదుడు... వైఎస్ జగన్ మార్క్ దోపిడీ. జగన్ విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారు అని వైకాపా నాయకులు దరువు వెయ్యడమే ఆలస్యం’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 40 రోజుల లాక్ డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తొలిరోజు 25 శాతం మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, ఆ తర్వాత మరో 50 శాతం పెంచింది. మొత్తం 75 శాతం మేర మద్యం ధరలు పెరిగాయి. అయితే, మద్యం ధరలను విపరీతంగా పెంచడం ద్వారా ప్రజల్లో మద్య పాన నిషేధాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వైసీపీ నేతలు వాదిస్తున్నారు. లాక్ డౌన్‌లో మూసి ఉన్న మద్యం దుకాణాలను తెరిచి, ధరలు పెంచిని ప్రభుత్వం, మళ్లీ మద్యపాన నిషేధం అంటుండడంపై విమర్శలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించే లోకేష్ ఇలా సెటైర్లు వేశారు.
బాదుడే... బాదుడు... @ysjagan మార్క్ దోపిడీ. జగన్ విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారు అని వైకాపా నాయకులు దరువు వెయ్యడమే ఆలస్యం#StopPowerTariffLoot pic.twitter.com/rPZnUgTj6y
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 10, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Liquor sales, Liquor shops, Nara Lokesh