ఏపీలో ఇంగ్లీష్ మీడియం జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు

ఇంగ్లీష్ మాధ్యమం అమలు కోసం టీచర్ల నియామకాలు, శిక్షణ చేపట్టేలా విద్యాశాఖ కమిషనర్ కు ఆదేశాలు కూడా జారీ చేశారు

news18-telugu
Updated: November 20, 2019, 2:57 PM IST
ఏపీలో ఇంగ్లీష్ మీడియం జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1 నుంచి 6వ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయనుంది జగన్ సర్కార్. ఆ తర్వాత ప్రతీ ఏడాది నుంచి ఒక్కో సంవత్సరం పెంచుతూ పదో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నారు. ఇంగ్లీష్ మాధ్యమం అమలుతో పాటు తెలుగు, ఉర్ధూలో ఒక భాష తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.ఇంగ్లీష్ మాధ్యమం అమలు కోసం టీచర్ల నియామకాలు, శిక్షణ చేపట్టేలా విద్యాశాఖ కమిషనర్ కు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంగ్లీష్ మాధ్యమం అమలుకు వీలుగా టీచర్ల హ్యాండ్ బుక్ లు, శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలని ఎస్ఈఆర్ఈటీకి ఆదేశించారు. టీచర్ల నైపుణ్యాల అభివృద్ధికి ఎస్ఈఆర్టీతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఇప్పటికే ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై అమలుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మాతృభాషను మసకబారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంగ్లీష్ అవసరమే కానీ.. తెలుగును విస్మరిస్తూ ఊరుకునేంది లేదంటూ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జగన్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుకు ఆదేశాలు జారీ చేయడం రాఫ్ట్ర రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్‌గా మారింది.

ఇవికూడా చూడండి:
పావురాలకు దాణా వేయడం నిషేధం
First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading