Home /News /politics /

JAGAN GOVT INCREASE THE FINANCIAL AID TO THE CHRISTIANS FOR THE JERUSALEM PILGRIMAGE SB

జెరూసలేం యాత్రికులకు జగన్ గుడ్ న్యూస్

సీఎం జగన్

సీఎం జగన్

ఆర్ధిక సాయం పెంపుపై గత కేబినెట్‌లో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

    జెరూసలేం యాత్రికులకు ఏపీ సీఎం జగన్ శుభవార్త చెప్పారు. జెరూసలేం వెళ్లే వారికి ఆర్థిక సాయం పెంచుతూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రూ. 3 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంపును ప్రకటించింది. జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనా స్ధలాల సందర్శనకు ఆర్ధిక సాయం కూడా అందివ్వనుంది. ఆర్ధిక సాయం పెంపుపై గత కేబినెట్ లో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
    కేబినెట్ ఉత్తర్వులను అమలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Christmas, Ysrcp

    తదుపరి వార్తలు