ఏపీలో రైతు రుణమాఫీ పథకం రద్దు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన 7959.12 కోట్ల ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

news18-telugu
Updated: September 25, 2019, 1:43 PM IST
ఏపీలో రైతు రుణమాఫీ పథకం రద్దు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం
వైఎస్ జగన్...
  • Share this:
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య. ఈ ఏడాది మార్చి 10 తేదీన జారీ చేసిన జీవో నెంబరు 38ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన 7959.12 కోట్ల ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 4, 5 విడతల్లో చెల్లించాల్సిన మొత్తంతో పాటు 10 శాతం వడ్డీ కలిపి 7959.12 కోట్లు చెల్లింపులకు సంబంధించి జీవో నెంబరు 38 గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం ఆ జీవోను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది జగన్ సర్కార్. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 25, 2019, 1:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading