జగన్ కేసులో కనికరిస్తున్న సీబీఐ కోర్టు

సీఎం జగన్

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో వైఎస్ జగన్ సుమారు ఎనిమిదేళ్ల నుంచీ విచారణను ఎదుర్కొంటోన్నారు.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ కాస్త సానుకూలంగా వ్యవహరిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల విచారణ జరుగుతున్న విషయం తెలిసింది. అయితే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే అనేక సార్లు జగన్ సీబీఐకు విన్నవించుకున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టు కూడా వైఎస్ జగన్ కు విచారణకు హాజరు కాకపోవడంతో మినహాయింపు ఇస్తుంది. ప్రతీ శుక్రవారం కేసు విచారణకు జగన్ హాజరు విషయంలో ఆయన తరపు న్యాయవాదులు అనేక కారణాలూ చూపిస్తూ పిటిషన్లు వేస్తున్నారు. అయితే సీబీఐ కోర్టు ఈ వ్యవహారంలో కాస్త జగన్‌ను కనికరిస్తుంది.

    ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో వైఎస్ జగన్ సుమారు ఎనిమిదేళ్ల నుంచీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో ఆయన 16 నెలల పాటు హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్ పొంది బయటకువచ్చారు. ప్రస్తుతం వైఎస్ జగన్ బెయిల్ పై ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా.. వైఎస్ జగన్ ప్రతి శుక్రవారమూ న్యాయస్థానానికి హాజరవుతూ వచ్చారు.ఇప్పటికే తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ సీబీఐ కోర్టుకు పలుసార్లు కోరారు. అంతేకాదు... ఢిల్లీకి వెళ్లి పలువురు పెద్దల్ని కూడా ఈ వ్యవహారంపై కలిసినట్లు సమాచారం.
    Published by:Sulthana Begum Shaik
    First published: