• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JAGAN ATTACK CASE NIA COURT ORDERED SECRET INVESTIGATION IN YS JAGAN MOHAN REDDY AIRPORT ATTACK CASE SB

జగన్ కోడికత్తి కేసులో రహస్య విచారణ... మీడియాలో వివరాలు వద్దన్న ఎన్ఐఏ కోర్టు

జగన్ కోడికత్తి కేసులో రహస్య విచారణ... మీడియాలో వివరాలు వద్దన్న ఎన్ఐఏ కోర్టు

వైఎస్ జగన్

Jagan Attack Case: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో రహస్య విచారణ చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Share this:
    వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో రహస్య విచారణ చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణకు సంబంధించిన అంశాలు బయటకు రాకూడదని ధర్మాసనం ఆదేశించింది. కేసును రహస్యంగా విచారించాలని విజయవాడలోని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు, న్యాయవాదులు భద్రతా దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. కోర్టులో జరిగే విచారణకు సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచరించడానికి కూడా వీల్లేదని పేర్కొంది.

    జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది. ఎయిర్ పోర్టులో ఉన్న జగన్‌పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జగన్‌ ఎడమ భుజానికి తీవ్రగాయం అయ్యింది.  ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయలేదని వైసీపీ ఆరోపించింది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దాడి జరిగిన ప్రదేశం (విమానాశ్రయం లాంజ్‌) కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు దర్యాపు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.
    First published:

    అగ్ర కథనాలు