టీడీపీకి షాక్.. బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

ఎర్రశేఖర్ జడ్చర్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

news18-telugu
Updated: August 17, 2019, 4:15 PM IST
టీడీపీకి షాక్.. బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
ఎర్రశేఖర్ (File)
  • Share this:
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఈ నెల 18వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన మహాబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుండి 2009 లో ఎర్రశేఖర్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర సత్యం కూడ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ ఎర్ర శేఖర్ కు సోదరుడు అవుతారు. పి. చంద్రశేఖర్ కూడా గతంలో టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చంద్రశేఖర్ చేరారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 17, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading