‘అ కీలక అంశంలో టీడీపీ-వైసీపీ మధ్య అవగాహన’

రాజధాని అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తుండటానికి టీడీపీ-వైసీపీ మధ్య అవగాహనే కారణంకావచ్చు ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

news18-telugu
Updated: February 8, 2020, 8:00 PM IST
‘అ కీలక అంశంలో టీడీపీ-వైసీపీ మధ్య అవగాహన’
మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు(File Photo)
  • Share this:
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాజధాని అంశం చుట్టూనే నడుస్తున్నాయి. జగన్ సర్కారు మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతోంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. అన్ని ప్రాంతాల శ్రేయస్సు కోసం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుంటే టీడీపీ నేతలు అనవసర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ‘అమరావతి’ చుట్టూ నడుస్తున్న రాజకీయాలపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రాజధాని అంశం ఓ రకంగా వైసీపీ, టీడీపీ బలపడేందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. మూడో ప్రత్యామ్నానికి తావులేకుండా ఆ రెండు పార్టీల నాయకుల మధ్య అవగాహన ఉందేమోనన్న అనుమానం వ్యక్తంచేశారు. మరో ప్రత్యామ్నాం రాష్ట్రంలో ఎదగకూడదన్నదే వారి ప్లాన్‌గా కనిపిస్తోందన్నారు. వారి మధ్య అవగాహనకు అనుగుణంగానే రాజధాని ప్రధాన అంశంగా రాష్ట్రంలో నడుస్తుందేమో అర్థం కావటం లేదన్నారు. ఏపీలో బీజేపీ ఎదగకుండా చేసేందుకే ఇలా చేస్తున్నాయని ఐవైఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  రాజధాని అంశం తప్ప..ఇంకో అంశం లేదన్నట్లు మీడియా గత రెండు మాసాలుగా దీనిని ప్రధాన అంశం చేసిందని ఐవైఆర్ కృష్ణారావు అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజధాని అంశాన్ని కోర్టు నిర్ణయానికి వదిలిపెట్టి ఇతర అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 

First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు