టీటీడీ నిర్ణయంపై ఐవైఆర్ ఫైర్.. ముఖ్యమంత్రే పట్టు వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

news18-telugu
Updated: September 19, 2020, 11:51 AM IST
టీటీడీ నిర్ణయంపై ఐవైఆర్ ఫైర్.. ముఖ్యమంత్రే పట్టు వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదు..
ఐవైఆర్ కృష్ణారావు(ఫైల్ ఫొటో)
  • Share this:
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఈనాటి కాదని ఆయన గుర్తు చేశారు. ఈ నిబంధన ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతుందన్నారు. తాను విద్యార్థి దశలో తిరుపతికి వెళ్లినప్పుడు.. తమతో పాటు క్యూలో ఉన్న విదేశీయుడు డిక్లరేషన్‌పైన సంతకం పెట్టాకే దర్శనానికి అనుమతించారని చెప్పారు.

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ దర్శనానికి వచ్చినప్పుడు కూడా నాటి టీటీడీ కార్యనిర్వహణాధికారి డిక్లరేషన్ కోసం గట్టిగా పట్టుబట్టారని తెలిపారు. అయితే ఆ తర్వాత ఆయన పలువురు నేతల ఆగ్రహానికి గురయ్యాడని చెప్పారు. అటువంటిది.. ఈనాడు ఉన్నఫలంగా ఈ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏముందో టీటీడీ అధ్యక్షులు సమాధానం ఇస్తే బాగుంటుందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదని అన్నారు. నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు చేశారు. ప్రసుత్తం ఐవైఆర్ చేసిన కామెంట్‌లు చర్చనీయాశంగా మారాయి.
ఇక, శ్రీవారిపై భక్తితో తిరుమలకు వచ్చే భక్తులు ఎటువంటి డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, కొద్దికాలంగా వైసీపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు తీసుకుంటున్న కొన్ని  నిర్ణయాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఉన్న టీటీడీ ఆస్తుల విక్రయం, బహిరంగ మార్కెట్ శ్రీవారి లడ్డు విక్రయం వంటి నిర్ణయాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
Published by: Sumanth Kanukula
First published: September 19, 2020, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading