యాక్సిలేటర్‌పై అవినీతి.. వెంటిలేటర్‌పై అభివృద్ధి.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ పంచ్‌లు

కాంగ్రెస్ హయాంలో అవినీతి యాక్సిలేటర్ మీద జోరుగా సాగుతుంటే, అభివృద్ధి వెంటిలేటర్ మీద ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

news18-telugu
Updated: April 5, 2019, 5:42 PM IST
యాక్సిలేటర్‌పై అవినీతి.. వెంటిలేటర్‌పై అభివృద్ధి.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ పంచ్‌లు
ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ
  • Share this:
కాంగ్రెస్ పార్టీ పాలన మీద ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి యాక్సిలేటర్ మీద జోరుగా సాగుతుంటే, అభివృద్ధి వెంటిలేటర్ మీద ఉండేదన్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, అవినీతి జంటగా చేతిలో చెయ్యివేసి నడుస్తాయని ఎద్దేవా చేశారు. భద్రతా బలగాలకు రక్షణ కల్పించే AFSPA మీద సమీక్ష చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం ద్వారా సైన్యం మానసిక స్థైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘ముక్కల ముక్కల’ గ్యాంగ్ మాత్రమే సంతోషంగా ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్స్ జమ్మూకాశ్మీర్‌కి ప్రధాని కావాలని కోరుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. వారసత్వ రాజకీయాలకు నెలవైన కుటుంబం ఇప్పుడు జైలు నుంచి బయటపడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

అంతకు ముందు యూపీలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాలు ‘మోదీ హఠావో’ నినాదం ఇచ్చాయని, అయితే.. వారి లక్ష్యం మాత్రం వారసత్వ రాజకీయాలేనని చెప్పారు. కుంభమేళాలో పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగినప్పుడు బీఎస్పీ చీఫ్ మాయావతి తనను హేళన చేసిందని, అదే కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించినప్పుడు మాత్రం నోరెత్తలేదని చెప్పారు.
First published: April 5, 2019, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading