రాజకీయ నాయకుల్లో తనకు లోకేష్ పెద్ద కమెడియన్‌గా కనిపిస్తాడని.. ఆయన కామెడీ బాగుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ.
ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్‌పై ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు వర్మ. ఆదివారం విజయవాడలో రోడ్డుపై పెడతానన్న వర్మ ప్రెస్ మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
వీలు దొరికినప్పుడల్లా టీడీపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబుపై విమర్శలు వేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మరోసారి ఏపీ సీఎంపై సెటైర్లు వేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి... మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు... లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న పేరుకు భయపడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఒకవేళ మీరు నిజంగా ఈ సినిమా చూసి భయపడితే... మీరు లోకేష్ పప్పు ఫాదరేనని సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్‌పై ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు వర్మ. ఆదివారం విజయవాడలో రోడ్డుపై పెడతానన్న వర్మ ప్రెస్ మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలో త్వరలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టాలని భావించారు వర్మ. కానీ... ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వర్మ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఏపీ ప్రభుత్వంతో పాటు.. చంద్రబాబుపై విమర్శలు చేశారు.
అంతకుముందు జగన్ కూడా వర్మకు అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందన్నారు. పోలీసుల్ని బంట్టోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందన్నారు. చంద్రబాబు గారూ... ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి ? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ వర్మ... తనకు మద్దతుగా నిలిచిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిజాన్ని ఎన్నటికీ దాచలేరన్న సంగతిని ఇంత వయసు వచ్చిన తరువాత కూడా చంద్రబాబుకు అర్థం కావడం లేదని, ఇది తనకు ఆశ్యర్యం కలిగిస్తోందని అన్నారు. మొత్తం మీద ట్విట్టర్ వేదికగా అటు జగన్... ఇటు వర్మ చంద్రబాబును రౌండప్ చేశారు.
Sir @ncbn after 40 years of political career and 3 times chief minister, if u are scared of just a film called #LakshmisNTR , now it’s proven that u are really Lokesh Pappu’s Father 🙏
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.