ITS NARA CHANDRA BABU NAIDU VS PEDDIREDDY RAMACHANDRAREDDY IN ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS AS PUNGANUR REGISTERS 100 PERCENT UNANIMOUS AND KUPPAM WILL HAVE ELECTIONS IN ALL VILLAGES HERE ARE THE
AP Panchayat Elections: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య పంచాయతీ వార్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) రాజకీయ రగడ తారాస్థాయికి చేరుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు (Telugu Desham Party) ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రగడ తారాస్థాయికి చేరుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీపడుతున్నాయి. ఏకగ్రీవాలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. తమకు ప్రజాబలముందంటూ వైసీపీ తిప్పికొడుతోంది. చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు భారీగా మోహరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో 85 గ్రామపంచాయతీలకుగానూ 85 ఏకగ్రీవం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వందశాతం ఏకగ్రీవాలతో పుంగనూరు రాష్ట్రంలోనే టాప్ ప్లేస్ లో నిలిచింది. పంచాయతీల్లో తీవ్రపోటీ నెలకొన్న పరిస్థితుల్లో మంత్రి నియోజకవర్గం పూర్తిగా ఏకగ్రీవం కావడం రికార్డనే చెప్పాలి.
ఐతే పుంగనూరులో ఏకగ్రీవాలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైసీపీకి పోటీగా ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్నవారిని మంత్రి పెద్దిరెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారని.. బలవంతంగా నామినేషన్లను విత్ డ్రా చేయిస్తునారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా ఫిర్యాదు చేసింది. బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. తన నియోజకవర్గంలో అసలు పోటీ అనేదే లేకుండా చేసుకునేందుకు పెద్దిరెడ్డి కుట్రలు చేశారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ సీఎం జగన్ పాలనపై నమ్మకంతోనే ప్రజలు ఏకగ్రీవాలకు ముందుకు వస్తున్నారని.. ఇందులో ఎలాంటి వివాదాలకు తావులేదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఒక్క ఏకగ్రీవం కూడా నమోదుకాలేదు. కుప్పంలో 89 గ్రామపంచాయతీలుండగా.. అన్ని పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు పోటీలో నిలిచారు. చంద్రబాబు స్వగ్రామంలో కూడా పోటీ నెలకొంది. కుప్పంలో కూడా 70శాతం పంచాయతీలను కైవసం చేసుకోని చంద్రబాబుకు షాకివ్వాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. కుప్పంకు చెందిన అధికారపార్టీ నేతలు కూడా ఇక్కడ మెజారీటీ స్థానాలు గెలిచి సీఎం జగన్ కు బహుమతిగా ఇస్తామని సవాల్ చేస్తున్నారు.
మరోవైపు కుప్పంలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కుప్పంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు తిష్టవేశారని.. నియోజకవర్గంలో అలజుడులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుతో పాటే కుప్పంలో స్థానికేతలురున్నారడానికి ఆధారాలున్నాయంటే వాహనాలకు సంబంధించిన ఫోటోలను కూడా జతచేశారు. కుప్పంలో సంఘ విద్రోహశక్తులు అరాచకాలు సృష్టించే అవకాశముందని దీనిపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. కుప్పం పరిధిలోని పోలింగ్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భధ్రతా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.