ఏప్రిల్ 11వ తేదీ నుంచి సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. News18 IPSOS ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. దేశంలో మరోసారి బీజేపీ హవానే ఖాయమని చెబుతున్నాయి. ఆరు విడతల్లో జరిగిన ఎన్నికల్లోనే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటిని సాధించినట్టు News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వేలో తేలింది. ఎన్డీయేకి 336 సీట్లు వస్తాయని News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ వార్ వన్ సైడ్ కాదు. లోక్‌సభకు సంబంధించి టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు News18-IPSOS ఎగ్జిట్ పోల్‌లో తేలింది. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి 10 నుంచి 12 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నట్టు న్యూస్18 ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తెలిసింది.
News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే అంచనాల ప్రకారం తెలంగాణలో మరోసారి కారు పార్టీ హవా కొనసాగనుంది. టీఆర్ఎస్ పార్టీకి 11 నుంచి 13 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే వచ్చే చాన్స్ ఉంది.