మోదీపై మాజీ జవాన్ పోటీ : 'ఇది అసలైన చౌకీదార్ Vs నకిలీ చౌకీదార్ మధ్య ఫైట్'

నరేంద్ర మోదీ, తేజ్ ప్రతాప్ (Images : ANI/Twitter)

asli vs nakli chowkidar in LS polls: Ex-BSF jawan : తాను పోటీ చేస్తానని చెప్పగానే చాలా పార్టీలు తనను సంప్రదించాయని.. కానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే తాను నిర్ణయించుకున్నానని ప్రతాప్ యాదవ్ అన్నారు.

 • Share this:
  భారత సైనికులకు సరైన ఆహారం అందించడం లేదంటూ గతేడాది ఓ వీడియో ద్వారా సంచలనం రేపిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్.. ఇప్పుడు వారణాసి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలు అసలైన చౌకీదారుకి, నకిలీ చౌకీదారుకి మధ్య జరగబోతున్నాయని.. తనను, ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జవాన్ల పేరు చెప్పుకుని ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న మోదీ.. అసలు వారి కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

  నేను మోదీని ప్రశ్నిస్తున్నా.. సైనికుల కోసం ఎన్నో హామీలు ఇచ్చిన ఆయన.. ఇప్పటివరకు ఏం చేశారో చెప్పాలి. ఇది ఇద్దరు సమవుజ్జీల మధ్య పోరాటం.. ఒకవైపు అసలైన చౌకీదార్, మరోవైపు నకిలీ చౌకీదార్. జవాన్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ విఫలమయ్యారు. కానీ వాళ్ల పేరు చెప్పుకుని మాత్రం ఓట్లు అడుగుతున్నారు.
  తేజ్ బహదూర్, మాజీ బీఎస్‌ఎఫ్ సైనికుడు


  తాను పోటీ చేస్తానని చెప్పగానే చాలా పార్టీలు తనను సంప్రదించాయని.. కానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికే తాను నిర్ణయించుకున్నానని తేజ్ బహదూర్ అన్నారు.కాగా, సైన్యంలో నాసిరకం ఆహారం పెడుతున్నారని 2017, జనవరిలో తేజ్ బహదూర్ పోస్ట్ చేసిన వీడియో పెను దుమారమే రేపింది. మిలటరీ అధికారులు కొందరు సైన్యానికి వస్తున్న ఆహార పదార్థాలను అమ్ముకుంటున్నారని వీడియో ద్వారా ఆయన ఆరోపణలు చేశారు. అయితే నిబంధనలకు విరుద్దంగా తేజ్ బహదూర్ వీడియో ద్వారా సైన్యం విషయాలు బయటపెట్టడంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన వారణాసిలో మోదీపై ఫైట్‌కి సిద్దమయ్యారు.


  First published: